Actor Nani: డియర్ బ్రదర్.. వర్రీ అవ్వొద్దు.. హర్రీ వద్దు.. సక్సెస్ గురించి నాని చెప్పింది విను..
గొప్ప కెరీర్లు, నిజమైన విజయాలు.. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితేనే సాధ్యమవుతాయి. నేటి యువతరం కోరుకునే తక్షణ ఫలితాలు, షార్ట్-ఫామ్ కంటెంట్ తరహా తక్షణ విజయం దీర్ఘకాలిక విలువను ఇవ్వవు. ప్రతిష్టాత్మక విజయాలకు స్టెప్-బై-స్టెప్ ప్రయాణం తప్పనిసరి అని హీరో నాని చెబుతున్నాడు. ఆతురత పడకుండా, ప్రతి అడుగుకూ విలువ ఇస్తూ ముందుకు సాగడమే కీలకం అనేది ఆయన యువతకు చెబుతున్న మాట.

యాక్టర్ నాని.. తెలుగు తెరపై తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. చిరంజీవి, రవితేజ తరహాలో ఈ జనరేషన్‌లో ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్‌గా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలైన అతని ప్రయాణం.. పాన్ ఇండియా స్టార్ రేంజ్‌కు వచ్చింది. గొప్ప కెరీర్లను నిర్మించడానికి చాలా ఓపిక అవసరం అని నాని చెబుతున్నాడు. నేటి యువతరం పది సెకన్ల రీల్స్, ఇనిస్టెంట్ రిజల్ట్స్ ప్రపంచంలో నివసిస్తోంది. ఈ తక్షణ సంతృప్తిని కోరుకునే ధోరణి.. ప్రతి రంగంలోనూ కనిపిస్తుందని నాని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతిదీ తక్షణమే జరగాలని, విజయం కూడా వేగంగా రావాలని ఆశిస్తున్నారు. కానీ నిజమైన విజయం తక్షణమే లభించదు. జీవితంలో లేదా వృత్తిలో ఏ గొప్పదైనా సాధించడానికి క్రమబద్ధమైన ప్రయత్నం, స్థిరత్వం, ఓపికతో కూడిన ఎదురుచూపులు అవసరం అని నాని అంటున్నారు. విజయానికి సరైన పద్ధతి అడుగు అడుగుగా, దశలవారీగా ముందుకు సాగడమే. అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వంటి స్పష్టమైన ప్రణాళికను అనుసరించాలి. కృషి చేయకుండా నేరుగా 10వ లేదా 100వ అడుగు మీద నిలబడాలని కోరుకుంటే, ఆ ప్రగతికి నిజమైన విలువ ఉండదని నాని చెబుతుున్నారు. ధైర్యంతో కూడిన కష్టపడే స్వభావం, నిరంతరం మిమ్మల్ని మీరు సానబెట్టుకోవడం, సరైన మైండ్ సెట్ ద్వారానే సక్సెస్ మెంటాలిటీని పెంపొందించుకోవచ్చని ఈ యాక్టర్ యువతకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. తక్షణ సంతృప్తిని వదిలిపెట్టి, లక్ష్యాలను సాధించడానికి నిరంతరంగా శ్రమించడం వల్లనే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. అప్పుడే ప్రతి అడుగుకు విలువ, విజయం శాశ్వతంగా నిలుస్తాయి. అందకు నాని జీవితమే ఉదాహారణ.
