AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సాయి పల్లవి.. దర్శకుడు ఎవరంటే..

హిట్లు ఫ్లాప్స్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ భారీ అంచనాల మధ్య విడుదలై యావరేజ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవలే విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సాయి పల్లవి.. దర్శకుడు ఎవరంటే..
Vijay Devarakonda
Rajeev Rayala
|

Updated on: May 15, 2024 | 12:44 PM

Share

టాలీవుడ్  క్రేజీ కాంబినేషన్ తెరపైకి రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్స్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ భారీ అంచనాల మధ్య విడుదలై యావరేజ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవలే విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు విజయ్ తో ఓ స్టార్ హీరోయిన్ జతకట్టనుందని తెలుస్తోంది. ర‌వికిర‌ణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడు.

విజయ్ దేవరకొండ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తెరకెక్కించిన ర‌వికిర‌ణ్ కోలా  ఇప్పుడు విజయ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రూరల్ స్టోరీతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. రూర‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది.

దాంతో ఆ పాత్రకు సాయి పల్లవి అయితేనే కకరెక్ట్ గా సరిపోతుందని భావిస్తున్నారట. ఈమేరకు ఆమెను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తమిళ్ లోనూ ఓ సినిమా చేస్తుంది సాయి పల్లవి. అలాగే బాలీవుడ్ బడా మూవీ రామాయణం సినిమాలో సీతగా నటిస్తుంది సాయి పల్లవి. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నారు. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో విజయ్ తో సాయి పల్లవి నటిస్తుందా లేదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా..

 సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us