Nithiin: అసలే కష్టాల్లో ఉన్న నితిన్.. ఇప్పుడు మనోడికి జోడీగా మరో బ్యాడ్ లక్ బ్యూటీ
బ్యాడ్ టైమ్ బంతాట ఆడుతున్నపుడు ఎంతమంది కలిసి ప్లాన్ చేసినా.. ఎంత మంచి ప్లాన్ వేసినా వర్కవుట్ అవ్వదు. నితిన్ విషయంలోనూ ఇదే జరుగుతుందేమో.? వరసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్టైతే రావట్లేదు. అందుకే కాస్త టైమ్ తీసుకున్నా పర్లేదు కానీ.. కొడితే కుంభస్థలమే అంటున్నారు ఈ హీరో.

టాలీవుడ్ కుర్ర హీరో నితిన్. జయం సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ ఆతర్వాత దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. కానీ నితిన్ ఖాతాలో హిట్స్ మాత్రం పడలేదు. అప్పట్లో నితిన్ వరుసగా 13 ఫ్లాప్స్ అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నితిన్ సై అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుసగా 13 ఫ్లాప్స్ అందుకున్నాడు. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇష్క్ తర్వాత, గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాతో హిట్స్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. ఆ మధ్య వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా హిట్ అయ్యింది.
ఇది కూడా చదవండి :తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.
భీష్మ సినిమా హిట్ తర్వాత యధావిధిగా వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు. రీసెంట్ డేస్ లో నితిన్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మాచర్ల నియోజకవర్గం, రాబిన్ హుడ్ ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా తమ్ముడు సినిమాతో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు జబర్దస్త్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వేణు బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి తెలంగాణ బ్యాడ్రాప్ లో ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా
ఇదిలా ఉంటే నితిన్ తనకు ఇష్క్ లాంటి హిట్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. వరుస ఫ్లాప్స్ లో సతమతం అవుతున్న నితిన్ ఇప్పుడు విక్రమ్ కుమార్ తో సినిమా చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. పూజా కూడా చాలా రోజులుగా హిట్స్ లేక సతమతం అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇక ఇప్పుడు నితిన్ తో జోడీ కట్టనుందని అంటున్నారు.మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








