AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే ఇండస్ట్రీకి దేవుడయ్యాడు..! షూటింగ్ మొదటి రోజే దర్శకుడికి గుండెపోటు.. సూపర్ స్టార్ కృష్ణ ఏం చేశారంటే

తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే.. అంతేకాదు కృష్ణ ఒకానొక సమయంలో రోజుకి మూడు షిప్ట్ ల చొప్పున పని చేసి.. ఏడాదికి 10 సినిమాలు చేశారు.

అందుకే ఇండస్ట్రీకి దేవుడయ్యాడు..! షూటింగ్ మొదటి రోజే దర్శకుడికి గుండెపోటు.. సూపర్ స్టార్ కృష్ణ ఏం చేశారంటే
Krishna
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2025 | 12:50 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. తెలుగు సినిమాల్లో ఆయన ఓ శిఖరం.. ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశారు కృష్ణ. బుర్రిపాలే అనే గ్రామం నుంచి వచ్చిన కృష్ణ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నారు. నాగేశ్వరావు క్రేజ్ చూసి తాను కూడా ఎలాగైనా హీరో కావాలని అని కసితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కృష్ణ. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు. కృష్ణ ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించారు. ఇది ఆయన కెరీర్‌లోని ఒక రికార్డు. 1972లో ఆయన 18 సినిమాలు విడుదలయ్యాయి. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న కృష్ణ.. అనేక ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

కృష్ణ చేయని పాత్ర లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ఈనాడు, సింహాసనం, మోసగాళ్లకు మోసగాడు, అమ్మ దొంగ ఇలా ఎన్నో డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసి మెప్పించారు. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ కృష్ణ తన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పటిలో కృష్ణ సినిమా వస్తుందంటే చాలు జనాలు ఎడ్ల బండ్లు, ట్రాకర్స్ వేసుకొని మరీ వెళ్లేవారు. సూపర్ స్టార్ కృష్ణను ఇండస్ట్రీలో దేవుడు అని పిలుస్తుంటారు. నిర్మాతల పాలిట నిజంగానే కృష్ణ దేవుడు. అలాగే దర్శకులను కూడా ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. తాజాగా నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కృష్ణ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఆయన మాట్లాడుతూ.. కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా చేస్తానంటే.. ఎన్టీఆర్ వద్దు అన్నారు. సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వదు.. వద్దు అన్నారు.. అయినా కృష్ణ వినలేదు.. అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ మొదలు పెట్టగానే డైరెక్టర్ వి. రామచంద్రరావు గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే వైజాగ్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే మీకు ఏం కాదు.. జాగ్రత్తగా ఉండండి.. మీరు వచ్చేవరకు సినిమాను నేను డైరెక్ట్ చేస్తా.. మీరు పూర్తిగా తగ్గే వరకు రెస్ట్ తీసుకోండి అని చెప్పి.. ఆయనను హాస్పటల్ కు పంపించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అవ్వక ముందే ఆయన చనిపోయారు.. కానీ కృష్ణగారు సినిమా రిలీజ్ అయిన తరువాత దర్శకుడిగా వి. రామచంద్రరావు పేరే వేశారు. సినిమా రిలీజ్ తర్వాత కూడా డైరెక్టర్ గా ఆయనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ను కూడా వి. రామచంద్రరావు ఇంటికి పంపించారు కృష్ణ.. అందుకే ఆయనను దేవుడు అంటారు అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..