AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: పెద్దితో స్టెప్పులేసేది ఈ పిల్లే .. థియేటర్స్ ఉగిపోవాల్సిందే అంటున్న ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

Peddi: పెద్దితో స్టెప్పులేసేది ఈ పిల్లే .. థియేటర్స్ ఉగిపోవాల్సిందే అంటున్న ఫ్యాన్స్
Peddi
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2025 | 3:21 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చివరిగా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత చరణ్ ఫ్యాన్స్ ఆయన నుంచి అదిరిపోయే పాన్ ఇండియా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో కలిసి సినిమా అనౌన్స్ చేశాడు చెర్రీ. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన బుచ్చిబాబు తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొత్త హీరో,కొత్త హీరోయిన్ తో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఏకంగా రూ. 100కోట్లకు పైగా కలెక్ట్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆతర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బుచ్చి బాబు ఇప్పుడు చరణ్ తో సినిమా చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి :తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.

ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఈ మూవీ పెద్ది అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. మొన్నామధ్య పెద్ది నుంచి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అదేవిధంగా ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కు సంబంధించిన వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చరణ్ తో స్పెషల్ సాంగ్ చేయడానికి ఓ స్టార్ హీరోయిన్ ను సెలక్ట్ చేశారనేది ఆ వార్త.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

అయితే ఆమె ఎవరు అన్నది ఇంతవరకూ రివీల్ కాలేదు.. దాంతో ఎవరికి నచ్చిన హీరోయిన్ పేరు వారు రాసుకుంటున్నారు. చరణ్ తో స్టెప్పులేయడానికి బాలీవుడ్ నుంచి హీరోయిన్ ను దింపుతున్నారని కొందరంటుంటే మరికొందరేమో మన టాలీవుడ్ స్టార్ హీరోయినే చరణ్‌తో డాన్స్ చేయనుందని బల్ల గుద్ది చెప్తున్నారు. ఆ లిస్ట్ లో కాస్త గట్టిగా వినిపిస్తున్న పేరు సమంత. ఇప్పటికే ఈ చిన్నది పుష్ప రాజ్ పక్క “ఉ అంటావా మామ..” అంటూ ఊపేసింది. దాంతో ఇప్పుడు చరణ్ పక్కన కూడా ఈ అమ్మడే స్టెప్పులేసేది అని చెప్తున్నారు. ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ కూడా అదే.. దాంతో ఫ్యాన్స్ కాస్త గట్టిగానే ఫిక్స్ అయ్యారు. ఇక రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆ స్పెషల్ సాంగ్ ను ఉత్తరాంధ్ర స్టైల్ లో ఉంటుందని మరో టాక్..

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.