AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: పాపం పూజ.. టాలీవుడ్‌లో బుట్టబొమ్మకి మళ్లీ మంచి రోజులొస్తాయా?

సౌత్‌ లో మంచి ఫామ్‌ లో ఉన్న టైమ్‌ లోనే బాలీవుడ్ మీద ఫోకస్ చేయటం పూజ కెరీర్‌‌ను కష్టాల్లో పడేసింది. సౌత్‌‌లో అవకాశాలు తగ్గటం, నార్త్‌‌లో సక్సెస్‌ రాకపోవటంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఆ టైమ్‌ లో మరో పెద్ద మిస్టేక్ చేశారు బుట్టబొమ్మ. వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌ స్పీడు పెంచాల్సిన టైమ్‌ లో వచ్చిన ఆఫర్స్‌ కు నో చెబుతూ తప్పు చేశారు.

Pooja Hegde: పాపం పూజ.. టాలీవుడ్‌లో బుట్టబొమ్మకి మళ్లీ మంచి రోజులొస్తాయా?
Pooja Hegde
Satish Reddy Jadda
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 24, 2023 | 10:36 PM

Share

సక్సెస్, ఫెయిల్యూర్‌ తో సంబంధం లేకుండా ఒకప్పుడు టాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌ లో  ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. కెరీర్‌ స్టార్టింగ్‌ లో చాలా కాలం ఒక్క హిట్ కూడా లేకపోయినా… కెరీర్‌ను బాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. కెరీర్‌ సక్సెస్ ట్రాక్ ఎక్కిన తరువాత అమ్మడి జోరు నెక్ట్స్‌ లెవల్‌ కు  చేరింది. తెలుగులో వరుస హిట్స్‌ తో టాప్ ప్లేస్‌ కి చేరారు. కానీ ఎంత త్వరగా టాప్ లీగ్‌ లోకి ఎంట్రీ ఇచ్చారో అంతే త్వరలోగా ఫామ్ కోల్పోయారు.

సౌత్‌ లో మంచి ఫామ్‌ లో ఉన్న టైమ్‌ లోనే బాలీవుడ్ మీద ఫోకస్ చేయటం పూజ కెరీర్‌‌ను కష్టాల్లో పడేసింది. సౌత్‌‌లో అవకాశాలు తగ్గటం, నార్త్‌‌లో సక్సెస్‌ రాకపోవటంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఆ టైమ్‌ లో మరో పెద్ద మిస్టేక్ చేశారు బుట్టబొమ్మ. వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌ స్పీడు పెంచాల్సిన టైమ్‌ లో వచ్చిన ఆఫర్స్‌ కు నో చెబుతూ తప్పు చేశారు.

రాధేశ్యామ్ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే ఆ సినిమా ప్రమోషన్స్‌ స్టార్ట్ అయిన తరువాత మరో మూవీకి ఓకే  చెప్పలేదు. రాధేశ్యామ్ నేషనల్ సెన్సేషన్ అవుతుందని, ఆ సినిమా రిలీజ్ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే భారీ పేమెంట్ డిమాండ్ చేయవచ్చన్న ఆశతో కొత్త సినిమా ఓకే చేయకుండా వెయిట్ చేశారు పూజాహెగ్డే. ఆ ప్రయోగమే మిస్‌ ఫైర్ అయ్యింది.

View this post on Instagram

A post shared by Filmfare (@filmfare)

రాధేశ్యామ్ డిజాస్టర్ కావటంతో పూజ కెరీర్‌ పూర్తిగా గాడి తప్పింది. ఆ తరువాత సౌత్‌ తో పాటు నార్త్‌ లో చేసిన సినిమాలు కూడా ఫెయిల్ అవ్వటంతో అమ్మడికి అవకాశాలే కరువయ్యాయి. ప్రజెంట్ పూజా హెగ్డే చేతిలో ఒక్కటే సినిమా ఉంది. మలయాళ దర్శకుడితో షాహిద్ కపూర్ చేస్తున్న దేవా సినిమాలో హీరోయిన్‌ గా నటిస్తున్నారు బుట్టబొమ్మ. ఈ సినిమా మీద అమ్మడి భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు క్రిటిక్స్‌.

సిల్వర్‌ స్క్రీన్ మీద కెరీర్‌ స్లో అయినా సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు పూజా. వరుస ఫోటో షూట్స్‌ తో ఆన్‌ లైన్‌ లో హీట్ పెంచుతున్నారు. మూవీ అప్‌డేట్స్‌ తో వార్తల్లో కనిపించకపోయినా, గ్లామరస్‌ ఫోటస్‌ తో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ మాత్రం గట్టిగానే ట్రెండ్ అవుతోంది. మరి ఈ ట్రయల్స్‌ అమ్మడి కెరీర్‌ను ఇప్పటికైనా గాడిలో పెడతాయేమో చూడాలి.

పూజా హెగ్డే ఇన్‌స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)