Ajith Kumar: షాకింగ్ నిర్ణయం తీసుకున్న తల అజిత్.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్
తెగింపు షూటింగ్ సమయంలో అజిత్ నెక్ట్స్ మూవీకి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అసలు అజిత్ ఇప్పట్లో సినిమా చేసే ఆలోచనలోనే లేరని.. వన్ ఇయర్ బ్రేక్ తరువాతే నెక్ట్స్ సినిమా చేస్తారన్న టాక్ చాలా గట్టిగా వినిపించింది.

తెగింపుతో సూపర్ హిట్ అందుకున్న అజిత్.. నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేసిన అజిత్.. ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నారు. తెగింపు షూటింగ్ సమయంలో అజిత్ నెక్ట్స్ మూవీకి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అసలు అజిత్ ఇప్పట్లో సినిమా చేసే ఆలోచనలోనే లేరని.. వన్ ఇయర్ బ్రేక్ తరువాతే నెక్ట్స్ సినిమా చేస్తారన్న టాక్ చాలా గట్టిగా వినిపించింది. కానీ ఆ తరువాత డెసిషన్ మార్చుకున్నారు తల. తెగింపు రిలీజ్ టైమ్‌కు నెక్ట్స్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు అజిత్. యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో సినిమా ఉంటుంది క్లారిటీ ఇచ్చారు. లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా కన్పార్మ్ చేసింది. అయితే సడన్ ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది.
అజిత్ నెక్ట్స్ సినిమా ఆగిపోయిందన్న న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఇన్నాళ్లు తన ట్విట్టర్ బయోలో ఉన్న ఏకే 62 అనే హ్యాష్ ట్యాగ్‌ను విఘ్నేష్ శివన్ తీసేయటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నట్టే అనే ఫిక్స్ అయ్యారు కోలీవుడ్ ఆడియన్స్.
సంక్రాంతి బరిలో అజిత్‌తో పోటి పడిన విజయ్ ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేసిన టైటిల్ కూడా రివీల్ చేశారు. కానీ అజిత్ మాత్రం ఇంకా ప్రాజెక్ట్ లాక్ చేసే పనిలోనే ఉండటంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.




