Rakul Preet Singh: బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడిపేస్తోన్న సిల్వర్ స్క్రీన్ షిమ్లా మిర్చి రకుల్
లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ ఫైవ్ రిలీజులున్నాయి రకుల్ ప్రీత్‌సింగ్‌కి. ఎటాక్, కట్‌పుట్లి, డాక్టర్ జీ, థాంక్ గాడ్, రన్‌వే 34... ఇలా ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు రకుల్ ప్రీత్‌సింగ్. చేతినిండా పని ఉండటం కన్నా ఆనందం ఏం ఉంటుంది..

కొంతమంది హీరోయిన్లు కళ్ల ముందు కనిపించినట్టే ఉండరు. కానీ వాళ్ల ఫిల్మోగ్రఫీ లిస్టు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారని మనం ఆరా తీసే లోపే.. అబ్బో… ఇంత బిజీగా ఉన్నారా? అన్నట్టు నెంబర్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు రకుల్ యాజ్ ఇట్ ఈజ్ అలాంటి ఫేజ్‌లోనే ఉన్నారు. షి ఈజ్ టూ బిజీ అంటున్నారు ఆమె సన్నిహితులు. లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ ఫైవ్ రిలీజులున్నాయి రకుల్ ప్రీత్‌సింగ్‌కి. ఎటాక్, కట్‌పుట్లి, డాక్టర్ జీ, థాంక్ గాడ్, రన్‌వే 34.. ఇలా ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు రకుల్ ప్రీత్‌సింగ్. చేతినిండా పని ఉండటం కన్నా ఆనందం ఏం ఉంటుంది.. ఆ విషయంలో నేనెప్పుడూ అదృష్టవంతురాలినే. క్షణం తీరిక ఉండదు నాకు. ఎప్పుడూ బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తుంటాను. నా లైఫ్లో ఇప్పుడు హ్యాపీడేస్ నడుస్తున్నాయంటున్నారు సిల్వర్ స్క్రీన్ షిమ్లా మిర్చి రకుల్.
లాస్ట్ ఇయర్ మాత్రమే కాదు, 2023లోనూ అదే హవా కంటిన్యూ అవుతుందని చెబుతున్నారు రకుల్. ఆల్రెడీ రిలీజ్ అయిన ఛత్రివాలికి మంచి రెస్సాన్స్ వస్తోంది. రకుల్ చాలా బాగా చేశారంటూ సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. ఛత్రివాలీ అందించిన ఆనందంతో మిగిలిన ప్రాజెక్టులు చకచకా కంప్లీట్ చేసేస్తున్నారు మిస్ ఫిట్‌నెస్ ఫ్రీక్. నార్త్ లో మేరీ పత్నీ కా రీమేక్, 31 అక్టోబర్ లేడీస్ నైట్, సౌత్‌లో అయలాన్, ఇండియన్2 సినిమాలతో హెక్టిక్‌గా అటూ ఇటు షటిల్ సర్వీస్ చేస్తున్నారు రకుల్.
లైఫ్‌లో ఒకదానికోసం ఇంకోదాన్ని వదులుకోకూడదన్నది రకుల్ నమ్మే ఫిలాసఫీ. పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌నీ మిక్స్ చేయకూడదన్న విషయం తాను కెరీర్ స్టార్టింగ్‌లోనే నేర్చుకున్నానని అన్నారు రకుల్. అయితే ప్రేక్షకులను మెప్పించడం కోసం కెమెరా ముందు ఎంత కష్టాన్నైనా భరించడానికి రెడీ గా ఉంటానని, ఇటీవల చన్నీటిలో, చలిలో ఓ షూటింగ్ చేయడం కూడా అందులో భాగమేనని తెలిపారు ఈ బ్యూటీ.




