Allu Arjun: స్టార్ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ అయినట్టేనా..!
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఊర మాస్ పాత్రలో నటించి అదరగొట్టారు. ఎర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు లభించింది. సుకుమార్ పుష్ప తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. అలాగే అల్లు అర్జున్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు బన్నీ. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఊర మాస్ పాత్రలో నటించి అదరగొట్టారు. ఎర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు లభించింది. సుకుమార్ పుష్ప తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. అలాగే అల్లు అర్జున్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు బన్నీ. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నారని గతంలో టాక్ వినిపించింది. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూడు సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు నాలుగో సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram
అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా స్టార్ దర్శకుడు అట్లీతో చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది. తమిళ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా అట్లీ దూసుకుపోతున్నాడు. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Get ready to witness the world of JAWAN like never before – mightier, fiercer, and more thrilling than ever! 🔥#JawanTrailer out now!#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/WjfxCAVe3z
— atlee (@Atlee_dir) August 31, 2023
ఇప్పటికే జవాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చేసింది. ఇక ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరి అల్లు అర్జున్ తో అట్లీ ఎలాంటి కథను తెరకెక్కిస్తారా అన్న ఆసక్తి నెలకొంది. అలాగే అట్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయనున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అట్లీ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ రానుంది.
Jawan pre release event now in @SunTV 12pm -2pm pic.twitter.com/xP0kOfe204
— atlee (@Atlee_dir) September 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.