Jawan Movie Review: మాటల్లేవు.. గెట్ రెడీ బాక్సాఫీస్.. 1000 కోట్లు లోడింగ్..

పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత షారుక్ ఖాన్ నటించిన సినిమా కావడంతో జవాన్‌పై ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు దర్శకుడు అట్లీ కావడం.. సౌత్ టీం ఎక్కువగా సినిమాకు పనిచేయడంతో మన దగ్గర కూడా కూడా ఆసక్తి పెరిగిపోయింది. మరి వాటిని జవాన్ అందుకుందా.. కింగ్ ఖాన్ ఖాతాలో మరో హిట్ చేరిందా..? డీటైల్డ్ రివ్యూలో చూద్దాం..

Jawan Movie Review: మాటల్లేవు.. గెట్ రెడీ బాక్సాఫీస్.. 1000 కోట్లు లోడింగ్..
Jawan
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Sep 07, 2023 | 3:29 PM

పఠాన్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత షారుక్ ఖాన్ నటించిన సినిమా కావడంతో జవాన్‌పై ముందు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు దర్శకుడు అట్లీ కావడం.. సౌత్ టీం ఎక్కువగా సినిమాకు పనిచేయడంతో మన దగ్గర కూడా కూడా ఆసక్తి పెరిగిపోయింది. మరి వాటిని జవాన్ అందుకుందా.. కింగ్ ఖాన్ ఖాతాలో మరో హిట్ చేరిందా..? డీటైల్డ్ రివ్యూలో చూద్దాం..
రివ్యూ: జవాన్
నటీనటులు: షారుక్ ఖాన్, నయనతార, దీపిక పదుకొనే, విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు
ఎడిటర్: రూబెన్
సినిమాటోగ్రఫర్: GK విష్ణు
మ్యూజిక్: అనిరుధ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అట్లీ
నిర్మాత: గౌరీ ఖాన్

కథ:

ఆజాద్ (షారుక్ ఖాన్) ఓ జైలర్. అదే జైల్లో ఉండే కొందరు అమ్మాయిలతో కలిసి సమాజంలో అన్యాయం చేస్తున్న వాళ్లపై తిరగబడుతుంటారు. మెట్రో ట్రైన్‌ను హైజాక్ చేయడం.. హెల్త్ మినిస్టర్‌ను కిడ్నాప్ చేయడం లాంటివి చేస్తూ ఆయా డిపార్ట్స్‌మెంట్స్‌లో ఉన్న లోపాలను, ప్రభుత్వ పనితీరును ఎండగడుతుంటాడు ఆజాద్. అతన్ని పట్టుకోడానికి స్పెషల్ ఆఫీసర్ నర్మద (నయనతార) ట్రై చేస్తుంటుంది. ఈ ఇద్దరి మధ్యలో తన చూపులతోనే ఇండియాను షేక్ చేస్తున్న బిజినెస్ టైకూన్ ఖాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) ఉంటాడు. అతడు చేసే మోసాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటాడు ఆజాద్. ఇదే సమయంలో విక్రమ్ రాథోర్ (షారుక్ ఖాన్) ఆజాద్ జీవితంలోకి వస్తాడు.. మరి ఆయనెవరు..? ఐశ్వర్య (దీపిక పదుకొనే) ఎందుకొచ్చింది..? ఆజాద్‌ను నర్మద పట్టుకుందా లేదా అనేది మిగిలిన కథ..

కథనం:

పఠాన్ హిట్‌తో జోష్ మీదున్నాడు షారుక్ ఖాన్. ఆ సినిమాకు ఎలాంటి కొనసాగింపు ఇవ్వాలో.. జవాన్ పర్ఫెక్టుగా అలాంటి జోష్ నింపింది కింగ్ ఖాన్‌లో. అసలు ఈ సినిమా గురించి ఎలా మొదలుపెట్టాలి.. ఏమని చెప్పాలి.. జవాన్ హ్యాంగోవర్ దిగడానికే ఫ్యాన్స్‌కు రోజు పట్టేలా ఉంది. ఆ ఎలివేషన్లు.. ఎమోషన్లు.. యాక్షన్ సీన్స్.. ఒక్కముక్కలో పఠాన్‌ను ఉఫ్ అని ఊదేసాడు అట్లీ. సౌత్ డైరెక్టర్ సత్తా ఏంటో మరోసారి నార్త్ వాళ్లకు చూపించేసాడు. షారుక్ ఖాన్ అయితే అట్లీకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు.. నువ్వేమైనా చేసుకో.. బస్ నాకు హిట్ ఇవ్వు అన్నట్లున్నాడు. అట్లీ సినిమాల్లో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. జవాన్‌లోనూ అదే చేసాడు.. రెండింటినీ పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేసాడు. ముఖ్యంగా ఓ రైతు సీన్.. ఆ తర్వాత మెడికల్ స్కామ్‌లో పిల్లల సీన్ అయితే కళ్లలో నీళ్ళు తెప్పిస్తాయి. ఫస్టాఫ్ గూస్ బంప్స్.. ఆ ఎలివేషన్స్‌కు అనిరుధ్ మ్యూజిక్ కూడా తోడైంది. ఆ మ్యాజిక్ చెప్పడం కంటే స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే. ఇంటర్వెల్ అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ రానంత మెంటల్ మాస్ ఉంది. సెకండాఫ్ మెయిన్ స్టోరీలోకి వెళ్లడంతో కాసేపు నెమ్మదించింది. తండ్రి పాత్ర ఎంటరయ్యాక కథ ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది. ఇద్దరు షారుక్ ఖాన్‌లు స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తుంటే థియేటర్ ఊగిపోయింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఫుల్‌గా ట్రాక్ ఎక్కించాడు అట్లీ. కేవలం యాక్షన్ ఒక్కటే కాకుండా.. మెసేజ్ కూడా ఇచ్చాడు. మెడికల్, అగ్రికల్చర్‌తో పాటు మిగిలిన డిపార్ట్స్‌మెంట్స్‌లో జరుగుతున్న లోపాలు చూపించాడు. క్లైమాక్స్‌లో ఓటు ఎంత విలువైందో క్లాస్ కూడా తీసుకున్నాడు. మొత్తానికి మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాకు జవాన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.

నటీనటులు:

షారుక్ ఖాన్ మరోసారి అదరగొట్టాడు.. ఆయన ఎనర్జీకి సలాం. 57 ఏళ్ల వయసులోనూ పూర్తి ఫిట్‌గా కనిపించాడు కింగ్ ఖాన్. అతన్ని స్క్రీన్ మీద చూస్తుంటే యంగ్ హీరోలు కూడా ఫిదా అయిపోతారు. ఇక నయనతార డెబ్యూ అదిరిపోయింది. కారెక్టర్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంది. విజయ్ సేతుపతి విలన్‌గా రప్ఫాడించాడు. కానీ అతన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేదేమో అనిపించింది. దీపిక పదుకొనే చిన్న పాత్రే చేసినా ఇంపాక్ట్ ఉంది. ప్రియమణి సహా గ్రూపులో‌ ఉన్న అమ్మాయింతా బాగా నటించారు.

టెక్నికల్ టీం:

అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడంటే ఎలా ఉంటుందని అడక్కూడదు.. జస్ట్ విని ఎంజాయ్ చేయాలంతే. జవాన్‌కు కూడా అని మ్యూజిక్ బలం.. చాలా సన్నివేశాలు అతడి బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మరింత హై ఇచ్చింది. ఎడిటింగ్ కూడా ప్లస్ అయింది. రూబెన్ ఎడిటింగ్ సూపర్. జికే విష్ణు సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. దర్శకుడిగా అట్లీ మరోసారి నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. వెతికితే తప్ప లోపాలు కనిపించనంత బలంగా కథ, కథనాలు రాసుకున్నాడు. తెలిసిన కథే అయినా కూడా రాబిన్ హుడ్ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో ముందుకు తీసుకెళ్లాడు జవాన్ సినిమాను.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా జవాన్.. మాటల్లేవు.. గెట్ రెడీ బాక్సాఫీస్.. 1000 కోట్లు లోడింగ్..