బ్యాడైపోతున్న మహేశ్..డైరక్టర్ల టార్గెట్ ఎందుకయ్యాడు?

సూపర్ స్టార్ మహేశ్..ఈ నేమ్‌కు టాలీవుడ్‌లో ఉన్న  క్రేజ్ వేరు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం మహీకి వెన్నతో పెట్టిన విద్య. వివాదాలకు దూరంగా ఉండటం, తన పని తాను చేస్కోపోవడం, పలు సేవా కార్యక్రమాలు చెయ్యడం ఆయన స్టైయిల్. కానీ రీసెంట్ టైమ్స్ మహీ కాస్త బ్యాడ్ ఫేజ్‌ను ఫేస్ చేస్తున్నాడు. ఒకప్పుడు అతన్ని పొగిడిన, సన్నిహితంగా మెలిగిన వ్యక్తులే మహేశ్ బిహేవియర్ పట్ల నొచ్చుకుంటున్నారు. సెన్సిబుల్ డైరక్టర్ సుకుమార్, గతంలో మహేశ్‌తో కలిసి గతంలో వన్-నేనొక్కడినే […]

బ్యాడైపోతున్న మహేశ్..డైరక్టర్ల టార్గెట్ ఎందుకయ్యాడు?
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Jul 23, 2019 | 5:46 PM

సూపర్ స్టార్ మహేశ్..ఈ నేమ్‌కు టాలీవుడ్‌లో ఉన్న  క్రేజ్ వేరు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం మహీకి వెన్నతో పెట్టిన విద్య. వివాదాలకు దూరంగా ఉండటం, తన పని తాను చేస్కోపోవడం, పలు సేవా కార్యక్రమాలు చెయ్యడం ఆయన స్టైయిల్. కానీ రీసెంట్ టైమ్స్ మహీ కాస్త బ్యాడ్ ఫేజ్‌ను ఫేస్ చేస్తున్నాడు. ఒకప్పుడు అతన్ని పొగిడిన, సన్నిహితంగా మెలిగిన వ్యక్తులే మహేశ్ బిహేవియర్ పట్ల నొచ్చుకుంటున్నారు.

సెన్సిబుల్ డైరక్టర్ సుకుమార్, గతంలో మహేశ్‌తో కలిసి గతంలో వన్-నేనొక్కడినే అనే సినిమా చేశారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా సూపర్ స్టార్‌ని నటుడిగా మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. అయితే రంగస్థలం బ్లాక్ బాస్టర్ తర్వాత తనని ప్రోత్సహించిన మహేశ్‌కి ఎలాగైనా హిట్ ఇవ్వాలని భావించాడు సుకుమార్. అందుకు తగ్గ ఏర్పాట్లు జరిగాయి. కానీ ఏం జరిగిందో? ఏంటో? మహర్షి తర్వాత సుక్కు సినిమాని పక్కనపెట్టి..అనిల్ రావుపూడిని ట్రాక్‌లోకి తెచ్చారు.  దీంతో సుకుమార్ కు కోపమొచ్చింది. అదే స్టోరీతో బన్నీ హీరోగా సినిమా ప్రకటించాడు. దీంతో మహేష్-సుకుమార్ మధ్య గ్యాప్ పెరిగింది.

మహేష్-పూరి జగన్నాధ్. ఈ కాంబినేషన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదరు. పోకిరి, బిజినెస్‌మెన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బోనాంజా క్రియేట్ చేశారు. మహేశ్ కోసమో ‘జనగనమణ’ అనే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను రాసుకున్నాడు పూరీ. కానీ రీసెంట్ గా పూరి చేసిన వివాదాస్పద ప్రకటనతో ఈ కాంబినేషన్ పై కూడా అనుమానాలు ఎక్కువయ్యాయి. “మహేశ్ నాకు ప్లాపులుంటే సినిమాలు తియ్యడు..హిట్స్ ఉంటే మాత్రమే తీస్తాడు. మహేశ్ కన్నా, మహేశ్ ఫ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం” అంటూ సంచలన కామెంట్స్ చేశాడు పూరి. దీంతో పూరి లాంటి డైరక్టర్‌ని మహేశ్ నొప్పించాడా అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో స్టార్ట్ అయ్యింది.

వీరే కాదు గతంలో మణిరత్నం, గౌతమ్ మీనన్ లాంటి దర్శకులు కూడా అప్పట్లో సూపర్ స్టార్‌లో సినిమాలు తీయడానికి సన్నాహాలు చేసుకోని..తర్వాత డ్రాప్ అయ్యారు. మరి మహేశ్ ఎందుకు వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. మున్ముందు ఈ దర్శకులతో విభేదాలు సమసిపోయి..కాంబినేషన్స్ వర్కవుడట్ అవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu