
Salman Khan who is busy shooting Dabangg 3 with Sonakshi Sinha spent some time with his fans. He uploaded a video on Instagram where he is seen hitting himself with a whip
బాలీవుడ్ సూపర్ స్టార్..కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఆయనలో హ్యూమనిటీ యాంగిల్ కూడా ఉంది. ‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది అనాధలను చేరదీస్తున్నారు..వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఎంత షూటింగ్ బిజీలో ఉన్నా ‘బీయింగ్ హ్యూమన్’ కి వెళ్లి అక్కడి పిల్లలను ఆనందపరుస్తుంటారు. ఇది సల్మాన్ ఖాన్ లోని ఒక కోణం..మరో కోణంలో ఆయన చాలా కోపిష్టి, ముక్కుసూటిగా వెళ్లే మనస్తత్వం గల మనిషి, సల్మాన్ పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.
బాలీవుడ్ లో ఆయనకు ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, కొన్ని సార్లు హీరోయిన్లపై చేయి కూడా చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక కృష్ణ జింక, హిట్ అండ్ రన్ కేసు లు గురించి కోర్టు చుట్టూ తిరిగిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ ఏది చేసినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ పోతురాజు అవతారం ఎత్తాడు. అదేంటీ సల్మాన్ ఖాన్ కి పోతురాజుకీ సంబంధం ఏంటా అనుకుంటున్నారా?
పోతురాజు వేషధారణలో ఉన్న కొంతమందిని సల్మాన్ ఖాన్ ఇటీవల కలుసుకున్నాడు. వారితో కాసేపు ముచ్చటించిన భాయ్ అనంతరం వారి దగ్గర నుంచి కొరడా తీసుకొని సరదాగా తాను కూడా కొట్టుకున్నాడు. అనంతరం ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వారితో గడిపి వారి బాధను తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అలాగే మీరు ఇలా ట్రై చేయకండి, ఎవరు మీద కూడా ప్రయోగించకండని సల్మాన్ పేర్కొన్నారు. సల్మాన్ అలా చేయడం కొంత మందికి ఆశ్చర్యం వేసింది..మరికొంత మంది నవ్వుకున్నారు. అయితే తన ఒంటిపై కొట్టుకున్నంత సేపు సల్మాన్ ముఖంలో చిరునవ్వే కనిపించింది. .. ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.