తగ్గేదే లేదు..అక్కడ ఉంది ‘సైరా నరసింహారెడ్డి’

తగ్గేదే లేదు..అక్కడ ఉంది ‘సైరా నరసింహారెడ్డి’
Sye Raa Narasimha Reddy Release Date

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం  ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు  ఉయ్యాలవాడ  నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. హిందీతో పాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తూ ఉండంటంతో అందకు తగ్గట్టుగా మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.  250 కోట్ల రూపాయల ఖర్చుతో కొణిదెల ప్రాడక్షన్స్ బ్యానర్‌పై  ‘సైరా’ని నిర్మించాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. కాస్త లేట్ అయినా కూడా […]

Ram Naramaneni

|

Aug 31, 2019 | 8:57 PM

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం  ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు  ఉయ్యాలవాడ  నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. హిందీతో పాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తూ ఉండంటంతో అందకు తగ్గట్టుగా మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.  250 కోట్ల రూపాయల ఖర్చుతో కొణిదెల ప్రాడక్షన్స్ బ్యానర్‌పై  ‘సైరా’ని నిర్మించాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. కాస్త లేట్ అయినా కూడా సినిమా కంటెంట్ సాలిడ్‌గా వచ్చిందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాని బాలీవుడ్‌లో రిలీజ్ చెయ్యడానికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ముందుకు వచ్చింది.   పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఆనవాయితీ ప్రకారం బాలీవుడ్‌లో ఒక ఈవెంట్ చేసి మరీ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఆ టీజర్‌లోనే అక్టోబర్ 2న రిలీజ్ అని స్పష్టం చేశారు. అయితే బాలీవుడ్‌లో బడా ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘వార్’ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. యూత్‌లో, మాస్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసింది. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో, హై‌వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో సూపర్ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది.

‘సైరా’లో అమితాబ్ ఉన్నా..ప్రజంట్ యూత్ హృతిక్, టైగర్‌లు నటించిన సినిమాకే హిందీ యూత్ మొగ్గుచూపే అవకాశం ఉంది. అంత పెద్ద సినిమాతో పోటీపడడం ఇష్టం లేక ‘సైరా’ని రేస్‌లో నుండి తప్పిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఒక వారం లేటుగా, అంటే అక్టోబర్ 8న ‘సైరా’ రిలీజ్ కాబోతుంది అనే రూమర్స్ వినిపించాయి. అయితే అలాంటివి ఏం లేవని, అనుకున్న సమయానికి గ్రాండ్‌గా మూవీ రిలీజ్ అవ్వనుందని కొణిదెల ప్రొడక్షన్ హౌజ్ నుంచి సమాచారం అందింది. చిరంజీవి  రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ కేవలం ఒకే భాషలో రూ.100 కోట్ల కలెక్షన్స్ కొల్లగోట్టడంతో, సైరా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 250 కోట్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో, అలాగే ఓవర్సీస్‌లో సైతం ‘సైరా’ హవా కొనసాగబోతుంది. ఒక్కో సౌత్ ఇండియా లాంగ్వేజ్ నుంచి ఒక్కో స్టార్‌ని మూవీలో తీసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో కలెక్షన్లు దుమ్ములేపబోతున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu