బన్నీ ఫ్యాన్స్‌కి రేపు మరో సర్‌ప్రైజ్!

బన్నీ ఫ్యాన్స్‌కి రేపు మరో సర్‌ప్రైజ్!
Ala Vaikunthapuramulo First Look

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న  సినిమా ‘అల.. వైకుంఠపురములో’. ఈ మూవీ  ఫస్ట్​లుక్​ను ఆదివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఓ టీజర్​ హీరో పాత్ర ఎలా ఉండనుందో హింట్​ ఇచ్చింది. ‘గ్యాప్​ ఇవ్వలా.. వచ్చింది’ అంటూ అందులో బన్నీ చెప్పిన డైలాగ్​ ఆసక్తిరేపుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. మురళీ శర్మ, జయరామ్, టబు ఇతర ప్రధాన […]

Ram Naramaneni

|

Aug 31, 2019 | 9:43 PM

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న  సినిమా ‘అల.. వైకుంఠపురములో’. ఈ మూవీ  ఫస్ట్​లుక్​ను ఆదివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఎనౌన్స్ చేసింది. ఇప్పటికే విడుదలైన ఓ టీజర్​ హీరో పాత్ర ఎలా ఉండనుందో హింట్​ ఇచ్చింది. ‘గ్యాప్​ ఇవ్వలా.. వచ్చింది’ అంటూ అందులో బన్నీ చెప్పిన డైలాగ్​ ఆసక్తిరేపుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. మురళీ శర్మ, జయరామ్, టబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్​ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. గతంలో బన్నీ, త్రివిక్రమ్‌లు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో బ్లాక్‌బాస్టర్ హిట్స్ కొట్టారు. తాజా చిత్రం వీరిద్దరికి హ్యాట్రిక్ ఇస్తుందేమో చూడాలి.


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu