డ్యాన్సులు.. కౌగిలింతలు.. రిపీట్ మోడ్.. జున్నుతో నాని సందడి!

నాని.. ‘ది నేచురల్ స్టార్’… ‘అష్టాచెమ్మ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘అలా మొదలైంది’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి వైవిధ్యమైన చిత్రాలలో నటించి నేచురల్ స్టార్‌గా ఎంతోమంది అభిమానుల మనసును దోచుకున్నాడు హీరో నాని. ఇటీవల ‘జెర్సీ’ సినిమాతో హిట్ కొట్టిన నాని ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో… ప్రియా […]

డ్యాన్సులు.. కౌగిలింతలు.. రిపీట్ మోడ్.. జున్నుతో నాని సందడి!
Follow us

|

Updated on: Sep 01, 2019 | 8:03 AM

నాని.. ‘ది నేచురల్ స్టార్’…

‘అష్టాచెమ్మ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘అలా మొదలైంది’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి వైవిధ్యమైన చిత్రాలలో నటించి నేచురల్ స్టార్‌గా ఎంతోమంది అభిమానుల మనసును దోచుకున్నాడు హీరో నాని. ఇటీవల ‘జెర్సీ’ సినిమాతో హిట్ కొట్టిన నాని ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వలో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో…

ప్రియా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా తాజాగా నాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జున్నుతో నాని అల్లరి…

నేచురల్ స్టార్ తన ముద్దుల కొడుకు జున్ను(అర్జున్)తో కలిసి సరదాగా డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో ఫ్యాన్స్‌ను తెగ అలరిస్తోంది. ఇక ఈ వీడియోను నాని వైఫ్ అంజనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్‌ బిజీలో ఉండటంతో దాదాపు 20 రోజుల తర్వాత నాని తన కొడుకుతో టైం స్పెండ్ చేస్తున్నాడు.

నాని.. ఫ్యామిలీ టైం..

ఈ పిక్ షేర్ చేస్తూ.. ‘క్రికెట్, బిర్యానీ, ర్యాండమ్ డ్యాన్సింగ్ అండ్ బేర్ హగ్స్(కౌగిలింతలు)’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది అంజనా.. నాని, జున్నుని ఎత్తుకుని తిప్పుతూ డ్యాన్స్ చేస్తుండగా.. జున్ను నవ్వుతున్నాడు వీడియోలో.. తన కొడుకుతో నాని సరదాగా ఆడుకుంటున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘వి’తో విలన్‌గా…

కాగా నాని ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ అనే సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని 25వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేధా థామస్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది.

View this post on Instagram

Cricket, biryani, random dancing and bear hugs. #ReunitedWithNannaAfter20Days #junnuinamica

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) on