‘సాహో’… రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మితమైన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అభిమానులను సైతం నిరాశ పరిచింది. రిలీజైన మొదటి రోజే మిక్స్‌డ్ టాక్.. నెగటివ్ రివ్యూస్ దక్కించుకుంది. కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం వల్లే ‘సాహో’ డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. కొందరు నెటిజన్లు మాత్రం కొన్ని సెంటిమెంట్ల వల్లే సినిమా దెబ్బతిందని అంటున్నారు.
దర్శకధీరుడి సినిమా సెంటిమెంట్…
రాజమౌళి డైరెక్షన్‌లో నటించి భారీ హిట్స్ దక్కించుకున్న ప్రతి హీరో తన తర్వాత సినిమాలో ఘోర పరాజయం ఎదుర్కోవడం ఖాయం. ఇది టాలీవుడ్‌లో అందరికి తెలిసిన సెంటిమెంట్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సింహాద్రి’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ భారీ హిట్ సాధించగా.. ఆ తర్వాత ‘సుబ్బు’ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్ నమోదు చేసుకున్నాడు. అలాగే ‘యమదొంగ’ బ్లాక్‌బస్టర్ కాగా.. నెక్స్ట్ వచ్చిన ‘కంత్రి’ అట్టర్ ప్లాప్ అయింది. ఇక మాస్‌రాజా రవితేజ విషయానికి వస్తే.. జక్కన్న దర్శకత్వంలో ‘విక్రమార్కుడు’ సినిమాతో భారీ హిట్ అందుకోగా.. వెంటనే ‘ఖతర్నాక్’ సినిమాతో నిరాశపరిచాడు.
ప్రభాస్ కూడా ఇదే కోవలో…
‘ఛత్రపతి’ సినిమాతో ప్రభాస్ భారీ బ్లాక్‌బస్టర్ సాధించగా.. ఆ తర్వాత ప్రభుదేవా డైరెక్షన్‌లో చేసిన ‘పౌర్ణమి’ బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. అలాగే రామ్ చరణ్ కూడా ‘మగధీర’తో హిట్ దక్కించుకుని.. ఆ తర్వాత ‘ఆరంజ్’ సినిమాతో దారుణ పరాజయాన్ని ఎదుర్కున్నాడు. ఇక ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్‌కు ‘సాహో’తో ఎదురైందని అంటున్నారు.
జాకీ ష్రాఫ్ నటించిన సినిమా ప్లాప్…
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఇప్పటివరకు నటించి తెలుగు సినిమాలన్నీ డిజాస్టర్లు కావడం మరో కారణమని నెటిజన్ల అభిప్రాయం. ‘సాహో’ కంటే ముందు ఆయన నటించిన ‘పంజా’, ‘అస్త్రం’, ‘శక్తి’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాలు మూటగట్టుకున్నాయి.
రికార్డు కలెక్షన్స్…
ప్రపంచవ్యాప్తంగా రిలీజైన మొదటి రోజే ‘సాహో’ పలు రికార్డులను బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పరంగా రెండో స్థానాన్ని నిలబెట్టుకున్న ‘సాహో’.. ఓవర్సీస్‌లో కూడా తన మార్క్ చూపించింది. ఇక హిందీలో మొదటి రోజే 100 కోట్ల మార్క్ దాటగా.. తమిళనాడులో మాత్రం మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమా వసూళ్లను మాత్రం అధిగమించలేకపోయింది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి