బడా బాబులకు షాక్.. స్విస్ ఖాతాలు బయటపెట్టనున్న ప్రభుత్వం!

బ్లాక్ మనీని విదేశాలకు తరలిస్తూ.. స్విస్ బ్యాంకులలో కోట్లకు కోట్లు దాచుకుంటున్న బడా బాబుల వివరాలు కేంద్రానికి అందబోతున్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారి వివరాలను వెల్లడిస్తామంటూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. నల్లధనం వెలికి తీసేందుకు కంకణం కట్టుకున్న మోదీ సర్కార్.. ఒక్కో అడుగు ఆ దిశలో ముందుకు వేస్తోంది. ఇన్‌కంట్యాక్స్ విధి విధానాలను రూపొందించే సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్… నల్లధనంను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం […]

బడా బాబులకు షాక్.. స్విస్ ఖాతాలు బయటపెట్టనున్న ప్రభుత్వం!
Follow us

|

Updated on: Sep 01, 2019 | 11:13 AM

బ్లాక్ మనీని విదేశాలకు తరలిస్తూ.. స్విస్ బ్యాంకులలో కోట్లకు కోట్లు దాచుకుంటున్న బడా బాబుల వివరాలు కేంద్రానికి అందబోతున్నాయి. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారి వివరాలను వెల్లడిస్తామంటూ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. నల్లధనం వెలికి తీసేందుకు కంకణం కట్టుకున్న మోదీ సర్కార్.. ఒక్కో అడుగు ఆ దిశలో ముందుకు వేస్తోంది.

ఇన్‌కంట్యాక్స్ విధి విధానాలను రూపొందించే సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్… నల్లధనంను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. ఇందులో భాగంగా స్విస్ బ్యాంకులలో ఖాతాలు ఉన్నవారి వివరాలను సెప్టెంబరు నెల నుంచి వెల్లడిస్తామని ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో బడాబాబుల గుండెల్లో గుబులు మొదలైంది. ఇటీవల మోదీ స్విస్ టూర్ వెళ్ళినప్పుడు జరిగిన చర్చల్లో భాగంగా భారతీయుల ఖాతాల వివరాలను ఇచ్చేందుకు అక్కడి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని సీబీడీటీ తెలిపింది.

2018వ సంవత్సరానికి సంబంధించి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న భారతీయుల వివరాలను, లావాదేవీలను వెల్లడిస్తామని పేర్కొంది. స్విట్జర్లాండ్‌ అంతర్జాతీయ ఆర్థికశాఖ ప్రతినిధి నికోలస్ మారిలో లూషర్ భారత రెవిన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండేకు, సీబీడీటీ ఛైర్మెన్ పీసీ మోడీ, మరియు సీబీడీటీ సభ్యులు అఖిలేష్ రంజన్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయుల ఖాతాలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం.

ఇరు దేశ అధికారులు చర్చించుకుని పరస్పర సమాచారం అందించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య  స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని వారు భావిస్తున్నారు.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం