AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arha: సమంత ‘శాకుంతలం’ ట్రైలర్‏లో అల్లు అర్హను చూశారా? ఎంత ముద్దుగా ఉందో..

ప్ర‌ముఖ క‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు అజ‌రామ‌ర‌మైన ప్రేమ క‌థ‌ ఇది. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు మేకర్స్.

Allu Arha: సమంత 'శాకుంతలం' ట్రైలర్‏లో అల్లు అర్హను చూశారా? ఎంత ముద్దుగా ఉందో..
Allu Arha
Rajitha Chanti
|

Updated on: Jan 09, 2023 | 5:42 PM

Share

టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తోన్న మైథిలాజికల్ చిత్రం శాకుంతలం. ఈ అద్భుతమైన పౌరాణిక దృశ్యకావ్యాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే నెల అంటే ఫిబ్రవరి 17న తీసుకురాబోతున్నారు. ఇండియ‌న్ సినీ ప్రియులు 2023లో చూడాల‌నుకుని ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న విజువ‌ల్ వండ‌ర్‌గా శాకుంత‌లం త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. ఇందులో సామ్ శాకుంతలగా కనిపించనుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ క‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు అజ‌రామ‌ర‌మైన ప్రేమ క‌థ‌ ఇది. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ట్రైలర్ లో… దుర్వాస మహర్షిగా మోహన్ బాబు.. మేనకగా మధుబాలతోపాటు.. సీనియర్ నటి గౌతమి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇక ఇదే చిత్రంలో అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ కూడా కీలకపాత్రలో కనిపించనుంది. అయితే శాకుంతలం ట్రైలర్ రాగానే అందరి కళ్లు అర్హ కోసం వెతకసాగాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ అల్లరిగా..క్యూట్ క్యూట్ గా కనిపించే అర్హ.. ఈ మైథిలాజికల్ చిత్రంలో ఎలాంటి లుక్‏లో కనిపించనుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు నెటిజన్స్. అర్హను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూడాలని ఎదురుచూస్తున్న అభిమానుల ముందుకు శాకుంతలం ట్రైలర్‏లో అర్హను చూపిస్తూ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి
Allu Arha, Shaakuntalam

Allu Arha, Shaakuntalam

ఈ చిత్రంలో అర్హ శకుంతల కుమారుడు భరతుడి చిన్ననాటి పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన శాకుంతలం ట్రైలర్ చివరలో చిన్ననాటి భరతుడిగా.. సింహంపై కూర్చుని ఎంట్రీ ఇచ్చింది అర్హ. మృగరాజుపై ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న అర్హను చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అర్హ ఎంతో ముద్దుగా ఉందంటూ.. ఆమెకు సంబంధించిన క్లిప్ ను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్