Karthika Deepam: హమయ్యా.. ఎట్టకేలకు ముగింపు పలికిన కార్తీకదీపం.. ఆ సీరియల్‏కు వంటలక్క.. డాక్టర్ బాబు ఆహ్వానం..

కార్తీక దీపం.. మీకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది. మీ గుండెల్లో చోటుని కల్పించింది. ప్రతి గొప్ప కథకు ఓ ముగింపు ఉంటుంది..

Karthika Deepam: హమయ్యా.. ఎట్టకేలకు ముగింపు పలికిన కార్తీకదీపం.. ఆ సీరియల్‏కు వంటలక్క.. డాక్టర్ బాబు ఆహ్వానం..
Karthika Deepam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2023 | 4:02 PM

కొన్నేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన కార్తీక సీరియల్ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. గత ఆరేళ్లుగా బుల్లితెర బాహుబలి అనిపించుకుంటూ..ఫ్యామిలీ ఆడియన్స్‏కు కన్నీళ్లు పెట్టిస్తూ..ఇక క్లైమాక్స్ వచ్చేసింది అన్న సన్నివేశాలతో.. అంతలోనే కథ మలుపు తిప్పుతూ సాగదీస్తున్న ఈ సీరియల్ ఇప్పుడు ఎండ్ కార్డ్ పడబోతుంది. అయితే ధారవాహికలో వచ్చే కల కాదు.. నిజమే.. సోషల్ మీడియా వేదికగా నేరుగా వంటలక్క.. డాక్టర్ బాబు అనౌన్స్ చేశారు. “కార్తీక దీపం.. మీకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది. మీ గుండెల్లో చోటుని కల్పించింది. ప్రతి గొప్ప కథకు ఓ ముగింపు ఉంటుంది.. (ప్రాణాలు వదిలేది నేను అని దీప అన్న డైలాగ్ చూపిస్తూ) కార్తీక దీపం మీకు నచ్చే అద్భుతమైన క్లైమాక్స్ తో మీ ముందుకు రాబోతుంది. ఈ సీరియల్ ముగింపు మరో సరికొత్త కథకు నాంది పలకబోతుంది. అదే బ్రహ్మముడి.. మా మీద మీరు చూపించిన ప్రేమాభిమానాలు.. కావ్య రాజుపై కూడా చూపించాలి” అంటూ చెప్పుకొచ్చారు వంటలక్క.. డాక్టర్ బాబు. ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

కొత్తగా రాబోతున్న బ్రహ్మముడి సీరియల్లో బిగ్ బాస్ ఫేమ్ మానస్ హీరోగా కనిపించనున్నాడు. ఇక ఈ సీరియల్ ప్రమోషన్స్ డాక్టర్ బాబు.. వంటలక్క స్టార్ట్ చేసారు. ఇక కార్తీక దీపం సీరియల్ విషయానికి వస్తే.. ఇక కొన్ని నెలలుగా బోరింగ్ గా సాగుతున్న ఈ సీరియల్లోకి మోనిత రీఎంట్రీ ఇచ్చింది. వెళ్లిపోతున్నాను.. తీసేసారు అంటూ ప్రత్యేకంగా వీడియో షేర్ చేసిన శోభితా.. ఇప్పుడు ఆకస్మాత్తుగా తిరిగి వచ్చేసింది. ఇన్నాళ్లు డాక్టర్ బాబు కోసం మోనిత మాత్రమే పోటీపడగా.. ఇప్పుడు చారుశీల కూడా ఎంటర్ అయ్యింది. కార్తీక్ ను పెళ్లి చేసుకుని ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేస్తున్న చారుశీలకు అడ్డుపడింది మోనిత.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు.. చారుశీల ఇచ్చిన మందులతో దీప ప్రాణాలు పోగొట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అటు హిమ, శైర్య, సౌందర్య, ఆనందరావు కార్తీక, దీపలను వెతికే పనిలో పడ్డారు. అయితే గతంలోనే మోనితా దీపకు స్లో పాయిజన్ ఇవ్వగా.. ఇప్పడు చారుశీల సైతం వేరే మందులు ఇవ్వడం.. క్రమంగా వంటలక్క ఆరోగ్యం క్షీణించడం చూస్తే.. దీప మరణంతో ఈ కార్తీక దీపం సీరియల్ ఎండ్ కార్డ్ పడనున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.