AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayasai Reddy: వాల్తేరు వీరయ్య సినిమాపై విజయసాయిరెడ్డి ట్వీట్‌.. చిరంజీవి గురించి వైసీపీ ఎంపీ ఏమన్నారంటే?

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జై లవకుశ ఫేం కే.ఎస్‌. రవీంద్ర (బాబీ) తెరెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మల్టీస్టారర్‌ ఈనెల 13న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

Vijayasai Reddy: వాల్తేరు వీరయ్య సినిమాపై విజయసాయిరెడ్డి ట్వీట్‌.. చిరంజీవి గురించి వైసీపీ ఎంపీ ఏమన్నారంటే?
Vijayasai Reddy, Chiranjeevi
Basha Shek
|

Updated on: Jan 09, 2023 | 5:45 PM

Share

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జై లవకుశ ఫేం కే.ఎస్‌. రవీంద్ర (బాబీ) తెరెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మల్టీస్టారర్‌ ఈనెల 13న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీనికి ముందు సినిమా ప్రమోషన్లలో భాగంగా విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి స్పీచ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా రవితేజ గురించి ఎవరికీ తెలియని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇదే సందర్భంలో వైజాగ్ నగరం గురించి మాట్లాడుతూ ‘ ఎప్పుడు విశాఖ వచ్చినా ఏదో తెలియని ఉద్వేగానికి గురవుతాను. వైజాగ్‌ నగరం స్వర్గధామం ఇక్కడి ప్రజలు విశాల మనస్కులు. ఎంతో హుందాగా ఉంటారు. మా సినిమాలను చూసి బాగా ప్రేమిస్తారు. ఎంతో ఓర్పు కలిగిన వీరి మధ్య సొంతంగా ఇల్లు కట్టుకుని సెటిల్‌ అవ్వాలనేది నా చిరకాల కోరిక. ఇటీవలే స్థలం కొన్నాను. త్వరలోనే ఇల్లు కూడా కట్టుకుంటాను’ అని చెప్పుకొచ్చారు. మెగాస్టార్‌ మాటలు విశాఖ వాసుల్లో ఎక్కడా లేని సంతోషాన్ని తీసుకొచ్చాయి. మెగాస్టార్‌ విశాఖపట్నంలో స్థిరపడితే అంతకంటే మంచి విషయం ఇంకేముంటుందని సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘ఆంధ్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖపట్నంలో మెగాస్టార్ చిరంజీవి స్థిరపడాలనుకోవడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. కాగా విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆ మధ్య టాలీవుడ్‌ హీరోలని కోరిన విషయం తెలిసిందే. ఇందుకోసం స్థలాలు కూడా ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈనేపథ్యంలో చిరు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మెగాస్టార్‌ వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరు నిర్ణయాన్ని విజయసాయి రెడ్డి సమర్థిస్తూ ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..