Kalki 2898 AD: కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర పై క్రేజీ బజ్.. అసలు మ్యాటర్ అదేనా..

‘కల్కి 2898 AD’ సినిమాతో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ కలగలిపి విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898 AD’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో ముఖ్యంగా రెబల్ స్టార్ ఫాన్స్ లో ఆసక్తి మొదలైంది. ఆతర్వాత ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.

Kalki 2898 AD: కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర పై క్రేజీ బజ్.. అసలు మ్యాటర్ అదేనా..
Dulquer Salmaan
Follow us

|

Updated on: Jul 01, 2024 | 8:56 AM

మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన దర్శకుడు నాగ్ అశ్విన్.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి.. మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ సినిమాతో ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. పౌరాణిక, సైన్స్ ఫిక్షన్ కలగలిపి విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898 AD’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో ముఖ్యంగా రెబల్ స్టార్ ఫాన్స్ లో ఆసక్తి మొదలైంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ప్రభాస్ ఎలా కనిపించనున్నాడు అంటూ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూశారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ప్రభాస్ ను ఓ సూపర్ హీరోగా చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్.

ఇక మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రోల్ చాలా పవర్ ఫుల్ గా చూపించారు. భైరవ అనే పాత్రలో నటించాడు ప్రభాస్. అలాగే ప్రభాస్ రోల్ పై ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలా మంది పాత్రలు చూపించాడు నాగి. అలాగే కల్కి సినిమాలో అశ్వత్థామ పాత్రలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించాడు. అలాగే చాలా క్యారెక్టర్స్ ఏ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా మంది నటులను చూపించాడు నాగ్ అశ్విన్.

అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా నటించాడు. ఈ సినిమాలో ప్రభాస్ ను పెంచే క్యాప్టెన్ గా నటించాడు దుల్కర్. ప్రభాస్ ను పెంచి పెద్ద చేస్తాడు. అలాగే ప్రభాస్ కు ఫైటింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాడు. అయితే దుల్కర్ క్యారెక్టర్ గురించి కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అయితే దుల్కర్ పాత్ర ను కల్కి సినిమాలో చాలా సింపుల్ గా చూపించాడు కానీ అతను సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది. సినిమాలో దుల్కర్ ప్రభాస్ ను పెంచే క్రమంలో ఎక్కడ చూసినా అతను యంగ్ గానే కనిపిస్తాడు. అంటే వయసు పెరగదు. దాంతో అతని పాత్ర కూడా మహాభారతంలో నుంచే తీసుకున్నాడని .. కల్కి సెకండ్ పార్ట్ లో పరశురాముడిగా చూపిస్తారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే పార్ట్ 2 వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.