- Telugu News Photo Gallery Cinema photos Actress Janhvi Kapoor Focus on Tollywood for her next movies Telugu Heroines Movies
Janhvi Kapoor: ఇకపై సౌత్ లోనే.. టాలీవుడ్ లో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అని డౌట్స్.!
బాలీవుడ్‌లో బిజీగా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్, ప్రస్తుతం సౌత్ మీద ఫోకస్ చేస్తున్నారు. ప్రజెంట్ తెలుగులో రెండు భారీ చిత్రాల పనుల్లో ఉన్న ఈ బ్యూటీ అదే టైమ్‌లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్. అయితే ఈ బ్యూటీ డెబ్యూ నుంచే సౌత్ ఎంట్రీ గురించిన డిస్కషన్ గట్టిగా జరిగింది.
Updated on: Jul 01, 2024 | 8:54 AM

ఫస్ట్ సినిమాతో పెద్దగా క్లిక్ కాలేకపోయినా, ఇప్పుడు కల్కితో దిశా పాట్ని కూడా మంచి హిట్ అందుకున్నట్టే. ద్వితీయ విఘ్నం లేకుండా కంగువతోనూ గట్టెక్కాలనే తపనే కనిపిస్తోంది మిస్ దిశలో. సెప్టెంబర్‌లో దేవర మూవీతో సౌత్‌లో సక్సస్‌ఫుల్ గర్ల్ గా ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు జాన్వీ కపూర్.

కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. స్టార్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్.

అయితే ఈ బ్యూటీ డెబ్యూ నుంచే సౌత్ ఎంట్రీ గురించిన డిస్కషన్ గట్టిగా జరిగింది. అయితే ఊరించి ఊరించి ఫైనల్‌గా దేవర సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈ సినిమా రిలీజ్ కాకముందే రామ్ చరణ్‌కు జోడిగా నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సౌత్‌లో రెండు భారీ ప్రాజెక్ట్స్‌తో పాటు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్..

ప్యారలల్‌గా కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు ప్లాన్ చేసుకున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య సినిమాతో అరవ ఆడియన్స్‌ను పలకరించేందుకు ఓకే చెప్పారు జాన్వీ.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మెహతా, సూర్య లీడ్ రోల్‌లో ఓ మైథలాజికల్ మూవీని ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం కొద్ది రోజులు ముంబైలోనే ఉండి లుక్ టెస్ట్‌లలో కూడా పాల్గొన్నారు నడిప్పిన్ నాయగన్.

అయితే ఏం జరిగిందో ఏమోగానీ సడన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారు మేకర్స్. దీంతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న జాన్వీ ఆశలు మరికొద్ది రోజులు వాయిదా పడ్డాయి.




