- Telugu News Photo Gallery Cinema photos Hero Ajith Kumar is coming to India from Azerbaijan on July 1st Telugu Heroes Photos
Ajith Kumar: ఇండియాకి వస్తున్న అజిత్.. మరి విడాముయర్చి సంగతేంటి.?
కోలీవుడ్ తల అజిత్ ఇప్పుడు ఇండియాకి వచ్చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో ఉన్న ఆయన సోమవారం ఇండియాలో ల్యాండ్ కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటీవలే విడాముయర్చి సినిమా కోసం ఫ్లైట్ ఎక్కిన తల ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? మరి ఆయన వచ్చేస్తే, మిగిలిన టీమ్ అక్కడే ఉంటుందా.? లేకుంటే మొత్తం షూటింగ్ మధ్యలో ఆపి వచ్చేస్తారా?
Updated on: Jun 30, 2024 | 7:41 PM

కోలీవుడ్ తల అజిత్ ఇప్పుడు ఇండియాకి వచ్చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో ఉన్న ఆయన సోమవారం ఇండియాలో ల్యాండ్ కావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇటీవలే విడాముయర్చి సినిమా కోసం ఫ్లైట్ ఎక్కిన తల ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? మరి ఆయన వచ్చేస్తే, మిగిలిన టీమ్ అక్కడే ఉంటుందా?

లేకుంటే మొత్తం షూటింగ్ మధ్యలో ఆపి వచ్చేస్తారా? కోలీవుడ్‌లో ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన చర్చ. దాదాపు నెల రోజులు షూటింగ్ ప్లాన్ చేశారు అజర్‌బైజాన్‌లో.

అక్కడ కొన్ని పాటలు, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాలనుకున్నారు. అన్నీ పూర్తి చేసి వీలైనంత త్వరగా అజిత్‌ని ఈ ప్రాజెక్ట్ నుంచి రిలీవ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.

అయితే ఇప్పుడు అజిత్ సొంత పని మీద ఇండియాకి రావాల్సి వస్తోందట. పని పూర్తయిన వెంటనే టీమ్‌తో జాయిన్ అవుతారట.

అజిత్ లేని సమయంలో త్రిష, అర్జున్‌లాంటి మిగిలిన ఆర్టిస్టుల మీద షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్ మగిళ్‌తిరుమేని.

ఆ మధ్య అనారోగ్యానికి గురయ్యారు అజిత్. ఇప్పుడు ఆ చెకప్ కోసం వస్తున్నారన్న మాటలూ వైరల్ అవుతున్నాయి.




