- Telugu News Photo Gallery Cinema photos Heroine samantha clarity on healthy food branding, details here Telugu Actress Photos
Samantha: అవును నేను తప్పు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి జరగనివ్వను.. సమంత
అవును నేను తప్పు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మరోసారి అలాంటి పొరపాటు జరగనివ్వను. అంటూ గట్టిగా నిర్ణయమే తీసుకున్నారు స్టార్ హీరోయిన్ సమంత. ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్న ఈ బ్యూటీ, త్వరలో మళ్లీ కెరీర్‌ను రీస్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు సామ్. గత ఏడాది ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సమంత, ఆ తరువాత ఇంత వరకు కెమెరా ముందుకు రాలేదు.
Updated on: Jul 01, 2024 | 1:19 PM

ఇలాంటి టిప్స్ చెప్పి ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేయవద్దంటూ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో హీట్ గట్టిగా రావటంతో వెనక్కి తగ్గారు సామ్.

హెల్త్ ఇష్యూస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత, తన ప్రాబ్లమ్ నుంచి బయట పడేందుకు చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే జర్నీలో తన ఎక్స్‌పీరియన్సెస్ ఆధారంగా అప్పుడప్పుడు అభిమానులకు హెల్త్ టిప్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

గత ఏడాది ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సమంత, ఆ తరువాత ఇంత వరకు కెమెరా ముందుకు రాలేదు. ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నా.. అఫీషియల్‌గా ఏ సినిమా పట్టాలెక్కలేదు.

తాజాగా మరోసారి అలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు సామ్. తాజాగా మరో హెల్త్ టిప్ ఇచ్చారు సామ్. మెడిసిన్స్‌కు బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ కలిపి వాడితే సరిపోతుంది అంటూ సామ్ చేసిన పోస్ట్ మీద డాక్టర్లు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

ఆ మధ్య తన హెల్త్ ఇష్యూ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం పుడ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు.

తాను తినే విషయంలోనే కాదు తాను ప్రమోట్ చేసే ఫుడ్ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా అన్నారు సామ్.

ఆరోగ్యకరమైన ఫుడ్‌కి మాత్రమే బ్రాండింగ్ చేస్తానని చెప్పారు. తనలా మరొకరు బాధపడకూడదన్న ఉద్దేశంతో సమంత తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు.




