Waltair Veerayya: వాల్తేరు వీరయ్య వేదిక మారింది.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే

చిరంజీవితో పాటు ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Waltair Veerayya: వాల్తేరు వీరయ్య వేదిక మారింది.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే
Waltair Veerayya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 07, 2023 | 7:31 PM

మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్యా సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికాగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య ప్రీ రీలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు ప్రీరిలీజ్ వేదిక మారింది.  వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఫంక్షన్‌పై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.

ఇప్పటికీ మూడు సార్లు వాల్తేరు వీరయ్య వేదిక మారింది. మొదట ఆర్కే బీచ్.. తర్వాత ఏయూ.. మళ్లీ ఆర్కేబీచ్ అని అన్నారు. తాజాగా ఏయూలోనే ఫైనల్ చేశారు విశాఖ పోలీసులు. అయితే ఉదయం నుంచి ఆర్కే బీచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు వాల్తేర్ వీరయ్య యూనిట్. ఇప్పుడు సీపీ ఆదేశాలతో మళ్లీ ఏయూలో ఏర్పాట్లు మొదలు పెట్టారు.

ఇవి కూడా చదవండి

వేదిక ఖరారు విషయంలో పోలీసుల తీరుపై అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఎందుకిన్నిసార్లు మారుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు సీపీ. ఆర్కేబీచ్‌లో జనం సందోహం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో  వేదికను ఏయూకి మారుస్తున్నామని చిరంజీవికి చెప్పారు సీపీ. ఫైనల్ గా వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుంది.