AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika: నా గురించి అందుకే కామెంట్స్‌ చేస్తున్నారనుకుంటా.. ట్రోలింగ్‌పై స్పందించిన రష్మిక.

అత్యంత తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్‌ గుర్తింపు సంపాదించుకుంది అందాల తార రష్మిక మందన్న. చేసినవి కొన్ని సినిమాలే అయినా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకుందీ బ్యూటీ. పుష్ఫ మూవీతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిన ఈ బ్యూటీ నార్త్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే రష్మిక ఎంత పాపులారిటీని సొంతం...

Rashmika: నా గురించి అందుకే కామెంట్స్‌ చేస్తున్నారనుకుంటా.. ట్రోలింగ్‌పై స్పందించిన రష్మిక.
Rashmika
Narender Vaitla
|

Updated on: Jan 07, 2023 | 7:26 PM

Share

అత్యంత తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్‌ గుర్తింపు సంపాదించుకుంది అందాల తార రష్మిక మందన్న. చేసినవి కొన్ని సినిమాలే అయినా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకుందీ బ్యూటీ. పుష్ఫ మూవీతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిన ఈ బ్యూటీ నార్త్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే రష్మిక ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో అదే స్థాయిలో కాంట్రవర్సీలను సైతం ఎదుర్కొంటోంది. ఇటీవల రష్మికపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోన్న విషయం తెలిసిందే.

రష్మిక చేసిన కామెంట్స్‌పై నెట్టింట కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో తనపై వస్తోన్న ట్రోలింగ్‌పై రష్మిక స్పందించింది. రష్మిక నటించిన చిత్రం మిషన్‌ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నటీనటులుగా ప్రేక్షకులందరూ మమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలనుకోకూడదని నాకు తెలిసొచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఉండటం వల్ల అందరి దృష్టి మనపైనే ఉంటుంది. అలా, అని అందరికీ నేను నచ్చుతానని అనుకోను. నా విషయానికి వస్తే నేను మాట్లాడే విధానం, వ్యవహార శైలి, హావభావాలు.. వాళ్లకు నచ్చకపోవచ్చు. అందుకే నా గురించి కామెంట్స్‌ చేస్తున్నారు అనుకుంటా’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక నెగిటివిటీ పక్కన పెడితే తాను ఎంతో మంది అభిమానుల ప్రేమను పొందుతున్నానని, అందుకు వాళ్లందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని రష్మిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రష్మిక నటించిన వారిసు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు హిందీలో యానిమల్ చిత్రంతో పాటు పుష్ప2 చిత్రాల్లో నటిస్తోంది. ఇవన్నీ భారీ చిత్రాలు కావడంతో 2023 రష్మికకు కీలకంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..