Vishwak Sen’s Paagal: విశ్వక్ సేన్ ‘పాగల్’ సందడి చేసింది థియేటర్స్‌లోనే.. రిలీజ్ ఎప్పుడంటే
ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ సినిమాతర్వాత ఫలక్ నామ దాస్ అనే సినిమాతో

Vishwak Sen’s Paagal: ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ సినిమాతర్వాత ఫలక్‌నామ దాస్ అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసతో.. తనదైన యాటిట్యూడ్‌తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. అలాగే నేచురల్ స్టార్ నాని నిర్మించిన ‘హిట్’ అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ మాస్ కా దాస్. క్రైం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు ఈ క్రేజీ హీరో. పాగల్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. పాగల్ సినిమాను ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలో విష్వక్ సేన్ జోడీగా నివేదా పేతురాజ్ .. సిమ్రన్ చౌదరి కనువిందు చేయనున్నారు. రధన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. మురళీ శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Paagalమరిన్ని ఇక్కడ చదవండి :
