Laila Twitter Review: విశ్వక్ సేన్ లైలా ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ లైలా. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న అడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా.. ఆకాంక్ష శర్మ హీరోయిన్‏గా నటించింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ ద్వారా సినిమా పై ఆసక్తిని కలిగించారు.

Laila Twitter Review: విశ్వక్ సేన్ లైలా ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
Laila Movie Twitter Review

Updated on: Feb 14, 2025 | 6:48 AM

వాలెంటైన్స్ డే కానుకగా లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించి విడుదలకు ముందే సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు విశ్వక్ సేన్. టీజర్, ట్రైలర్ లలో విశ్వక్ యాక్టింగ్, కామెడీతోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాడు. ఇక ఇటీవల కొన్ని రోజులుగా రాజకీయ వివాదాలతోనూ నిత్యం వార్తలలో నిలిచింది ఈ సినిమా. ఇక ఇప్పుడు లైలా సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ చిత్రానికి ఓవర్ సీస్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇప్పటికే లైలా సినిమా ప్రీమియర్స్ చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో అదరగొట్టాడని.. తన క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ హిలేరియస్ గా నవ్విస్తాయని అంటున్నారు. లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ తన నటవిశ్వరూపం చూపించాడని.. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అంటున్నారు. విశ్వక్ కెరీర్ లోనే లైలా సినిమా ది బెస్ట్ డిఫరెంట్ మూవీగా నిలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. లైలా మూవీ కంప్లీట్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని.. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ ఎంతగా కష్టపడ్డాడో తెలుస్తోందంటున్నారు నెటిజన్స్. ఈ చిత్రంలో లియోన్ జేమ్స్ పాటలు, బీజీఎమ్ మాత్రం బాగున్నాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించగా.. ఇందులో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. అలాగే కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన