జెట్ స్పీడ్ తో షూటింగ్ కంప్లీట్ చేసిన విశాల్.. త్వరలోనే టీజర్ కూడా రానుందట..

తమిళ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన సినిమాలు అక్కడ ఇక్కడ విడుదలవుతుంటాయి. విశాల్ హిట్లు ఫ్లాప్ ను అస్సలు పాటించుకోరు

జెట్ స్పీడ్ తో షూటింగ్ కంప్లీట్ చేసిన విశాల్.. త్వరలోనే టీజర్ కూడా రానుందట..
Vishal
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 14, 2021 | 7:21 AM

తమిళ్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన సినిమాలు అక్కడ ఇక్కడ విడుదలవుతుంటాయి. విశాల్ హిట్లు ఫ్లాప్ ను అస్సలు పాటించుకోరు. వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంటారు. అలాగే ఆయన సినిమాలు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం చాలా కష్టం.. అంత వేగంగా సినిమాలను పూర్తి చేస్తారు విశాల్. ఇప్పుడు  అదే స్పీడ్ తో తన తాజా సినిమాను కంప్లీట్ చేసేసారు. విశాల్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రంలో ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్య  కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ‘నోటా’ ఫేమ్ ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది . ఈ సందర్భంగా సెట్ లో చిత్రయూనిట్ తో దిగిన ఫోటోను విశాల్ షేర్ చేసారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. ఎనిమీ షూటింగ్ పూర్తి చేశాం. త్వరలో టీజర్ విడుదలకు అంతా సిద్ధమవుతోంది. ఇలాంటి లవ్లీ టీమ్ తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటూ విశాల్ ట్వీట్ చేశారు. అలాగే ఈ ఫ్యాబులస్ మూవీలో ఆర్యతో కలిసి మళ్లీ వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో ఆర్య విలన్ గా కనిపించనున్నాడని అంటున్నారు. గతంలో విశాల్- ఆర్య కలిసి వాడు వీడు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood: ముంబైకి వచ్చే ముందు ఫిల్మ్ ఫేర్ పుస్తకం కొన్నా.. 20 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అంటున్న సోనూ సూద్

Renu Desai: అతను నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఏదీ నన్ను బాధించదు. ఆసక్తికర పోస్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.

Balakrishna Akhanda: ఫైనల్‌ షెడ్యూల్‌ మొదలు పెట్టిన బాలయ్య.. నెట్టింట వైరల్‌ అవుతోన్న మేకింగ్‌ స్టిల్స్‌.