Balakrishna Akhanda: ఫైనల్‌ షెడ్యూల్‌ మొదలు పెట్టిన బాలయ్య.. నెట్టింట వైరల్‌ అవుతోన్న మేకింగ్‌ స్టిల్స్‌.

Balakrishna Akhanda: 'గౌతమి పుత్ర శాతకర్ణి' తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు నట సింహం బాలకృష్ణ. అందుకే ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టి.. ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచాలని ఫిక్స్‌ అయిన బాలయ్య తనకు...

Balakrishna Akhanda: ఫైనల్‌ షెడ్యూల్‌ మొదలు పెట్టిన బాలయ్య.. నెట్టింట వైరల్‌ అవుతోన్న మేకింగ్‌ స్టిల్స్‌.
Balakrishna Akhanda
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 13, 2021 | 10:44 AM

Balakrishna Akhanda: ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు నట సింహం బాలకృష్ణ. అందుకే ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టి.. ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచాలని ఫిక్స్‌ అయిన బాలయ్య తనకు మంచి విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు ఎంతటి విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు దర్శకుడు బొయపాటు, ఇటు బాలయ్య బాబు కచ్చితంగా హిట్‌ కొట్టాల్సిన సమయంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తితో పాటు అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే బోయపాటి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా పరిస్థితులు మళ్లీ అనుకూలిస్తుండడంతో చిత్ర యూనిట్‌ చిత్రీకరణను ప్రారంభించింది. హైదరాబాద్‌లో సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్‌ అధికారికంగా ట్వీట్ చేసింది. షూటింగ్‌ స్పాట్‌లో దిగిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో బాలయ్య అఘోర పాత్రలో కనిపిస్తున్నారు. బోయపాటి సీన్‌ను వివరిస్తుండగా బాలయ్య బాబు ఎంతో ఆసక్తిగా వింటున్నారు. ఫైనల్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రీకాంత్‌ ప్రధాన ప్రాతలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

అఖండ లొకేషన్‌ ఫొటోలు..

Also Read: Ram Lingusamy: రామ్‌ – లింగు స్వామి సినిమాలో విలన్‌గా నటిస్తోంది ఎవరో తెలుసా.. తమిళ హీరోను దించుతోన్న మేకర్స్‌.?

Nani: మరో ప్రయోగం చేయనున్న నేచురల్‌ స్టార్‌.. రెండు కాళ్లు కోల్పోయిన సైనికుడిగా కనిపించనున్న నాని.

MAA Elections Vishnu: ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. మా ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో