Dhanush: మరో టాలీవుడ్ డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టిన ధనుష్.. ఆయన ఎవరంటే
స్టార్ హీరో ధనుష్ కూడా ఇటీవల తెలుగు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ధనుష్ ఇద్దరు తెలుగు దర్శకులను లైన్ లో పెట్టేశారు. వీరిలో ముందుగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు ధనుష్.
ఈ మధ్య కాలం తమిళ్ హీరోలు తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇప్పటికే దళపతి విజయ్, సూర్య, శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే స్టార్ హీరో ధనుష్ కూడా ఇటీవల తెలుగు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ధనుష్ ఇద్దరు తెలుగు దర్శకులను లైన్ లో పెట్టేశారు. వీరిలో ముందుగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమాకు సార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ధనుష్ స్కూల్ మాస్టర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అలాగే ఈ సినిమా తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గ ఉండనుందని టాక్. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ దర్శకుడికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఉడుగుల తో ధనుష్ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ వైవిధ్యమైన ప్రేమకథ ఆశించిన విజయం సాధించినప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ మధ్య తన పుట్టినరోజు సందర్భంగా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి స్పందించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పక్కా కమర్షియల్ అంశాలతో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఆ ప్రాజెక్ట్ ధనుష్ తోనే ఉంటుందని టాక్. శేఖర్ కమ్ముల సినిమా తర్వాత వేణు కాంబినేషన్లో ధనుష్ మూవీ ఉంటుందని తెలుస్తోంది.