AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shagun Kaur : లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ పద్దూ గుర్తుందా.? ఈ అమ్మడు ఇప్పుడు ఎక్కడ ఉందో.? ఏం చేస్తుందో తెలుసా..?

శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలు మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగే కథలను ఆధారంగానే శేఖర్ కమ్ముల సినిమాలు ఉంటాయి.

Shagun Kaur : లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ పద్దూ గుర్తుందా.? ఈ అమ్మడు ఇప్పుడు ఎక్కడ ఉందో.? ఏం చేస్తుందో తెలుసా..?
Life Is Beautiful
Rajeev Rayala
|

Updated on: Nov 26, 2022 | 11:28 AM

Share

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలు మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగే కథలను ఆధారంగానే శేఖర్ కమ్ముల సినిమాలు ఉంటాయి. ఇక ఆ సినిమాల్లో హీరోయిన్లు కూడా మనమధ్య తిరిగే సాధారణ అమ్మాయిల్లానే ఉండేలా చూసుకుంటారు శేఖర్ కమ్ముల. ఆనంద్ నుంచి మొదలు పెడితే మొన్న వచ్చిన లవ్ స్టోరీ వరకు ప్రతి సినిమా అంతే. ఇక శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కూడా అంతే మన మధ్య జరిగే కొన్ని అందమైన ప్రేమకథలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు శేఖర్. ఈ సినిమాలో జంటగా నటించిన అభిజిత్- షగున్ కౌర్, సుధాకర్-జారా సాశ్ అందరికి గుర్తుండే ఉంటారు. అయితే ఈ సినిమా తర్వాత ఈ హీరోలు ఒకటి రెండు సినిమాల్లో నటించారు. కానీ హీరోయిన్లు మాత్త్రం కనిపించలేదు.

అయితే ఈ భామతో షగున్ కౌర్ ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడుందో తెలుసా..?పద్మావతి అనే క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో చాలా మంది కొత్తవారు సినీ పరిశ్రమకు వచ్చారు. షగున్ కౌర్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. పక్కింటి అమ్మాయిగా ఆమె చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. షగుణ్ కౌర్ పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమైంది.

అయితే ఈ అమ్మడు లా చదివింది. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత లాయర్ గా సెటిల్ అయ్యిందని తెలుస్తోంది. అయితే ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్కడ దొరకడం లేదు. ఈ ముద్దుగుమ్మ అసలు ఇప్పుడు ఎక్కడుంది.. ఎలా ఉంది అని ప్రేక్షకులు నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు. ఏది ఏమైనా చేసిన ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేసింది ఈ చిన్నది.

Shagun Kaur

Shagun Kaur

Shagun Kaur 1

Shagun Kaur 1