AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prudhvi Raj: భార్యకు ప్రతి నెల రూ.8 లక్షలు ఇవ్వాల్సిందే..! కమెడియన్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

ప్రముఖ సినీ నటుడు, కమెడీయన్ పృథ్వీరాజ్‌‌ సినిమాతో కంటే ఈ మధ్య వివాదాలతో ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. పృథ్వీరాజ్‌‌ గురించిన ఎదో ఒక వార్త రోజు చక్కర్లు కొడుతూనే ఉంది.

Prudhvi Raj: భార్యకు ప్రతి నెల రూ.8 లక్షలు ఇవ్వాల్సిందే..! కమెడియన్‌కు షాక్ ఇచ్చిన కోర్టు
Prudhvi Raj
Rajeev Rayala
|

Updated on: Oct 01, 2022 | 9:51 AM

Share

ప్రముఖ సినీ నటుడు, కమెడీయన్ పృథ్వీరాజ్‌‌ సినిమాతో కంటే ఈ మధ్య వివాదాలతో ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. పృథ్వీరాజ్‌‌ గురించిన ఎదో ఒక వార్త రోజు చక్కర్లు కొడుతూనే ఉంది. సినిమాలతో పటు రాజకీయాల్లోనూ రాణించాలని ప్రయత్నించారు పృథ్వీరాజ్‌‌. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్‌‌కు విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెలా 8 లక్షల రూపాయలు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌తో 1984లో వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు సంతానం. ‘పృథ్వీరాజ్‌ విజయవాడలో అత్తారింట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడు. ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని, ఆయన నన్ను తరచూ వేధిస్తున్నాడంటూ ఆయన భార్య శ్రీలక్ష్మీ కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి గెంటివేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్‌ తన భార్యకు నెలకు 8 లక్షలు రూపాయలు, ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని సంచలన తీర్పిచ్చారు. ఇక పృథ్వీరాజ్‌‌ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.