AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: రూ.8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారు అమ్మేసిన విజయ్ దళపతి.. అసలేం జరిగిందంటే..

ఇప్పుడు ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ కు చెన్నైలో అనేక ఆస్తులు ఉన్నాయి. అలాగే అతడి వద్ద చాలా పెద్ద కార్ల కలెక్షన్ ఉంది. ఈ హీరో తరచుగా లగ్జరీ కారులలో కనిపిస్తాడు. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయ్ తన లగ్జరీ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును విక్రయించినట్లు తెలుస్తోంది. అలాగే కొత్తగా లెక్సస్ కారును కొనుగోలు చేశాడని.. ఇందుకు తన రోల్స్ రాయిస్‌ను విక్రయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం లేదు.

Vijay Thalapathy: రూ.8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారు అమ్మేసిన విజయ్ దళపతి.. అసలేం జరిగిందంటే..
Vijay Thalapathy
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2024 | 3:28 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ ఒకరు. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషలలో ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నాడు. విజయ్ సినిమాలకు అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే విజయ్ నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఇటు తెలుగులో విజయ్ దళపతికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటివరకు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విజయ్ అటు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటాడు. ఇప్పుడు ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ కు చెన్నైలో అనేక ఆస్తులు ఉన్నాయి. అలాగే అతడి వద్ద చాలా పెద్ద కార్ల కలెక్షన్ ఉంది. ఈ హీరో తరచుగా లగ్జరీ కారులలో కనిపిస్తాడు. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయ్ తన లగ్జరీ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును విక్రయించినట్లు తెలుస్తోంది. అలాగే కొత్తగా లెక్సస్ కారును కొనుగోలు చేశాడని.. ఇందుకు తన రోల్స్ రాయిస్‌ను విక్రయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం లేదు.

దళపతి విజయ్ తరచుగా రోల్స్ రాయిస్ కారులో కనిపిస్తూ ఉండేవాడు. అతను ఈ కారును హైవేపై నడుపుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుత నివేదికల ప్రకారం విజయ్ ఈ కారును విక్రయించాడు. ఎవరు కొన్నారనేది తెలియరాలేదు. ఈ కారు కొనుగోలు ధర 8 కోట్ల రూపాయలు. ఇంకా విజయ్ వద్ద BMW i7 X Drive 60 అనే లగ్జరీ కారు ఉంది. ఇది ఎలక్ట్రిక్ కారు. దీని ధర 2-2.5 కోట్ల రూపాయలు. భారతదేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ లగ్జరీ కారును కలిగి ఉన్నారు. అలాగే Audi L8, BMW 7 సిరీస్, BMW X6, Mercedes Benz GLAలను కలిగి ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్, BMW 5 సిరీస్, ఫోర్డ్ మస్టాంగ్, వోల్వో XC90. బెంజ్ ఇ350డి, బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్, మినీ కూపర్ ఎస్, టయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతి సుజుకి సిలారియోలను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ కలెక్షన్‌తో రోల్స్ రాయిస్ ఇక లేనట్లే. ప్రస్తుతం దళపతి విజయ్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 5న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో యోగి బాబు, మోహన్, ప్రభుదేవా తదితరులు నటించారు. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ఇంగ్లండ్‌లో మొదలైంది.