AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad News: జైలు నుంచే వయనాడ్ బాధితులకు హీరోయిన్ ప్రియుడు సాయం.. రూ. 15 కోట్లు, 300 ఇళ్లు విరాళం..

వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన బాధితుల సహాయార్థం రూ.15 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రియుడు సుకేష్ చంద్రశేఖర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం సుకేష్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కొన్ని నెలల క్రితం జైలుకు వెళ్లిన సుకేష్.. జైలు నుంచే వయనాడ్ బాధితులకు అండగా నిలిచారు.

Wayanad News: జైలు నుంచే వయనాడ్ బాధితులకు హీరోయిన్ ప్రియుడు సాయం.. రూ. 15 కోట్లు, 300 ఇళ్లు విరాళం..
Jacqueline
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2024 | 3:49 PM

Share

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగినపడిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 300లకు పైగా మృతి చెందగా.. వందలమంది గల్లంతయ్యారు. కొన్ని రోజులుగా ఆర్మీ, కేరళ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. బాధితులను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు. మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ స్టార్స్ భారీ మొత్తంలో విరాళాలు అందచేశారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ప్రియుడు సుఖేష్ చంద్రశేఖర్ భారీగా విరాళం అందచేసేందుకు ముందుకు వచ్చాడు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన బాధితుల సహాయార్థం రూ.15 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రియుడు సుకేష్ చంద్రశేఖర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం సుకేష్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కొన్ని నెలల క్రితం జైలుకు వెళ్లిన సుకేష్.. జైలు నుంచే వయనాడ్ బాధితులకు అండగా నిలిచారు.

ప్రస్తుతం దేశ రాజధానిలోని మండోలి జైలులో ఉన్న చంద్రశేఖర్ కేరళలో జరిగిన ప్రకృతి విపత్తు గురించి తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు. అక్కడి ప్రజలకు ప్రస్తుతం చాలా సహాయం కావాలని.. ఈ అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ప్రజలను ఆదుకోవాల‌ని కోరుతూ కేర‌ళ సీఎంకు లేఖ రాశాన‌ని సుకేష్ తరపు లాయ‌ర్ అనంత్ మాలిక్ తెలిపారు.

బాధితులకు రూ.15 కోట్ల సాయం అందించండి: సుకేష్ “సహాయ నిధి కోసం మా ఫౌండేషన్ నుండి 15 కోట్ల రూపాయలను అందించమని కేరళ ముఖ్యమంత్రిని నేను అభ్యర్థిస్తున్నాను. డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌ని ఉపయోగించుకోండి. నేను వాయనాడ్ కోసం నిలబడతాను. బాధితులకు తక్షణమే 300 ఇళ్లు నిర్మించేందుకు మరింత సాయం చేస్తాను. దానిని సుకేష్ చంద్రశేఖర్ లీగల్ అకౌంట్ నుండి ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించి, కొండచరియలు విరిగిపడిన విపత్తు బాధితుల సంక్షేమం, పునరావాసం కోసం ఉపయోగించాలని కోరుతున్నాను” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

చంద్రశేఖర్ లేఖపై కేరళ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అక్రమంగా డబ్బు వసూలు చేసిన కేసులో నిందితుడు కూడా జైలులో ఉన్నాడు. అందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం స్థానిక పరిపాలన విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఒక వారం క్రితం ఈ ఉత్తర కేరళ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడిన తరువాత 138 మంది ఇప్పటికీ తప్పిపోయారు.