The Birthday Boy: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సూపర్ థ్రిల్లింగ్ కామెడీ.. ఎక్కడ చూడొచ్చంటే..
ఈ వీకెండ్ మూవీ లవర్స్ కోసం సరికొత్త చిత్రాలను తీసుకువచ్చాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. హారర్ కామెడీ, రొమాంటిక్ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. తాజాగా మరో సూపర్ థ్రిల్లింగ్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ది బర్త్ డే బాయ్. బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి విస్కీ దాసరి దర్శకత్వం వహించారు.
ఈ వీకెండ్ మూవీ లవర్స్ కోసం సరికొత్త చిత్రాలను తీసుకువచ్చాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. హారర్ కామెడీ, రొమాంటిక్ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. తాజాగా మరో సూపర్ థ్రిల్లింగ్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ది బర్త్ డే బాయ్. బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి విస్కీ దాసరి దర్శకత్వం వహించారు. బొమ్మా బొరుసా బ్యానర్ పై భరత్ నిర్మించిన ఈ మూవీ జూలై 19న అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాలో ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేశ్, సాయి అరుణ్, రాహుల్ కీలకపాత్రలు పోషించగా.. ప్రశాంత్ శ్రీనివాస్ సంగీతం అందించారు. నరేష్ ఆడుపా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా… 2016లో డైరెక్టర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. పుట్టిన రోజు వేడుకలలో ఓ స్నేహితుడు ఎలా చనిపోయాడు ? ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
కథ విషయానికి వస్తే.. బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి అనే కుర్రాళ్లు అమెరికాలో చదువుకుంటూ ఉంటారు. వీరిలో బాలు పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వేడుకలలోనే బర్త్ డే బంప్స్ అని చెప్పి బాలును విపరీతంగా కొట్టడంతో అతడు చనిపోతాడు. దీంతో అమెరికాలో ఉన్న వీరంతా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు.. ? అసలు బాలును ఎందుకు చంపేశారు ? అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.