Vijay Thalapathy: లగ్జరీ కారు కొన్న విజయ్ దళపతి.. ఎన్ని కోట్లుంటుందో తెలుసా ?.. ప్రత్యేకతలు ఏంటంటే..

ఇటు తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఇటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ప్రస్తుతం విజయ్ తన కెరీర్‏లో రాబోతున్న 69వ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దళపతికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తమిళ్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటంటే.. దళపతి ఓ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడట.

Vijay Thalapathy: లగ్జరీ కారు కొన్న విజయ్ దళపతి.. ఎన్ని కోట్లుంటుందో తెలుసా ?.. ప్రత్యేకతలు ఏంటంటే..
Thalapathy Vijay
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 23, 2024 | 5:50 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఇటీవలే లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇటు తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఇటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ప్రస్తుతం విజయ్ తన కెరీర్‏లో రాబోతున్న 69వ చిత్రంలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్ దళపతికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తమిళ్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటంటే.. దళపతి ఓ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడట. అది కూడా కొత్తగా ఎలక్ట్రిక్ కారును కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. BMW i7 x Drive 60 లగ్జరీ కారును తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 2.50 కోట్లు అని నివేదికలు సూచిస్తున్నాయి. కారు మొత్తం బరువు 2,715 కిలోలు. కారు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి గరిష్టంగా ఐదున్నర గంటల సమయం పట్టవచ్చు.

అలాగే ఆ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 625 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని అంటున్నారు. విజయ్ దళపతికి ఆటోమొబైల్స్ పై విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే ఈ హీరో వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో సెలబ్రెటీలు ఎక్కువగా ఇష్టపడే రోల్స్ రాయిస్ కూడా ఒకటి. దీని ధర దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. బీస్ట్ సినిమా తర్వాత ఈ కారులోనే చిత్రయూనిట్ సభ్యులను తీసుకెళ్లి పార్టీ చేసుకున్నాడు. ఆ సమయంలో ఈ కారు గురించి పెద్ద చర్చే నడిచింది. ఇదే కాకుండా.. అతడి గ్యారేజీలో అనేక కార్లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. గతేడాది విజయ్ దళపతి నటించిన చిత్రాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ హీరో నటించిన వారసుడు చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. అలాగే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లియో మూవీ సైతం భారీ విజయాన్ని అందుకుంది. కోలీవుడ్‌లో మానాడు, మంకథా వంటి అత్యంత వినూత్న చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు విజయ్. ఇందులో మీనాక్షి చౌదరి, మైక్ మోహన్, యోగి బాబు, ప్రభుదేవా, ప్రశాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అర్చన కళాపతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..