Devara Movie: ‘దేవర’ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్.. సర్‏ప్రైజింగ్ ట్విస్ట్ ఇవ్వనున్న మేకర్స్ ?..

డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి నిత్యం ఓ రూమర్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

Devara Movie: 'దేవర' సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్.. సర్‏ప్రైజింగ్ ట్విస్ట్ ఇవ్వనున్న మేకర్స్ ?..
Devara, Jahnvi Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 23, 2024 | 5:22 PM

మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జనతా గ్యారేజ్ హిట్ తర్వాత మళ్లీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి నిత్యం ఓ రూమర్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో తారక్ క్యారెక్టర్ గురించి ఓ సర్ ప్రైజింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందని అంటున్నారు. అది కూడా దేవర సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తోందని అంటున్నారు. ఇందులో తారక్.. పూర్తిగా రఫ్ అండ్ రగ్గడ్ .. మాస్ లుక్ లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంటున్నారు.

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న మూడవ సినిమా ఇది. దీంతో దేవర కోసం తారక్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటుండగా.. ఇందులో గ్రామీణ అమ్మాయిగా కనిపించనుంది జాన్వీ. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను షేర్ చేయనున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుండగా.. ఆతర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సముద్ర నేపథ్యంలో మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసుకువస్తున్నారు. ఇక ఇందులో యాక్షన్స్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని.. అందుకు హాలీవుడ్ తోపాటు బాలీవుడ్ యాక్షన్ మాస్టర్లను పెట్టి షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ను దాదాపు రూ. 33 కోట్లకు టీ సిరీస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది అధికారికంగా ధ్రువికరించాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?