Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Thalapathy: దళపతి బర్త్ డే స్పెషల్.. అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్.. ది గోట్ యాక్షన్ గ్లింప్స్ అదిరిపోయింది..

తాజాగా విజయ్ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ హీరో ది గోట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటినీ కలిగించాయి. ఈ క్రమంలోనే తాజాగా ది గోట్ నుంచి స్పెషల్ గ్లింప్స్ షేర్ చేశారు.

Vijay Thalapathy: దళపతి బర్త్ డే స్పెషల్.. అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్.. ది గోట్ యాక్షన్ గ్లింప్స్ అదిరిపోయింది..
The Goat Glimpse
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2024 | 1:45 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తమిళంలోనే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ దళపతికి మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు తెలుగు ఫ్యాన్స్ కూడా దళపతి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ హీరో ది గోట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటినీ కలిగించాయి. ఈ క్రమంలోనే తాజాగా ది గోట్ నుంచి స్పెషల్ గ్లింప్స్ షేర్ చేశారు.

మొత్తం 50 సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియోలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు విజయ్ లు బైక్ పై వెళ్తుంటే విలన్స్ ఛేజింగ్ చేసే సీన్ అద్భుతంగా ఉంది. ఇక యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్స్ సన్నివేశాలనే హైలెట్ చేస్తూ సాగిన ఈ గ్లింప్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. దీంతో ఇప్పుడు ది గోట్ గ్లింప్స్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. హాలీవుడ్ రేంజ్ లో దర్శకుడి టేకింగ్ అందంటూ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ది గోట్ స్పెషల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. స్టైలీష్ పోషిస్తున్నారు. స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. పైకి లాగి చూడగా ఆశ్చర్యం
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. పైకి లాగి చూడగా ఆశ్చర్యం
ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. ఆ రోజు వస్తే అంతా ఉపవాసమే!
ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. ఆ రోజు వస్తే అంతా ఉపవాసమే!
మార్కెట్లో రూ. 50 నాణెం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం
మార్కెట్లో రూ. 50 నాణెం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం
డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. ఆ తర్వాత ఏమైందంటే..?
డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. ఆ తర్వాత ఏమైందంటే..?
అయిదు గ్రహాల అనుకూలత.. మరో రెండు నెలలు బెస్ట్ రాశులివే!
అయిదు గ్రహాల అనుకూలత.. మరో రెండు నెలలు బెస్ట్ రాశులివే!
ఇకపై స్కూల్స్, కాలేజెస్‌ పరిసరాల్లోని అవి విక్రయిస్తే అంతే సంగతి!
ఇకపై స్కూల్స్, కాలేజెస్‌ పరిసరాల్లోని అవి విక్రయిస్తే అంతే సంగతి!
రాత్రితల దగ్గర ఈవస్తువులు పెట్టుకునే అలవాటు ఉందా గుడ్ బై చెప్పండి
రాత్రితల దగ్గర ఈవస్తువులు పెట్టుకునే అలవాటు ఉందా గుడ్ బై చెప్పండి
అదొక టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌లా ఫీలయ్యా.. సమంత
అదొక టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌లా ఫీలయ్యా.. సమంత
ఆపిల్‌ బంపర్‌ ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌.. కేవలం .50 వేలకే ఐఫోన్‌ 16
ఆపిల్‌ బంపర్‌ ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌.. కేవలం .50 వేలకే ఐఫోన్‌ 16
రీల్స్ పిచ్చి.. తుపాకీ పట్టుకొని హైవేపై రీల్స్ చేసిన మహిళ..
రీల్స్ పిచ్చి.. తుపాకీ పట్టుకొని హైవేపై రీల్స్ చేసిన మహిళ..