AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharaj OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఆమిర్ ఖాన్ కుమారుడి ఫస్ట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎందులోనంటే?

బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన మొదటి సినిమా 'మహారాజ్'. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా చాలా సమస్యలను ఎదుర్కొంది. ఈ సినిమా విడుదల చేయకూడదని చాలా మంది ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు

Maharaj OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఆమిర్ ఖాన్ కుమారుడి ఫస్ట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎందులోనంటే?
Maharaj Movie
Basha Shek
|

Updated on: Jun 22, 2024 | 1:41 PM

Share

బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన మొదటి సినిమా ‘మహారాజ్’. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా చాలా సమస్యలను ఎదుర్కొంది. ఈ సినిమా విడుదల చేయకూడదని చాలా మంది ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు. అలాగే ఈ సినిమా విడుదలపై కూడా కోర్టు నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జునైద్ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ‘మహారాజ్’ సినిమాను విడుదల చేయవచ్చని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది . నిషేధం ఎత్తివేయబడిన వెంటనే, నెట్‌ఫ్లిక్స్ OTT ద్వారా సినిమాను విడుదల చేశారు మేకర్స్. బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ సంస్థ ‘మహారాజ్’ చిత్రాన్ని నిర్మిస్తోంది. జునైద్ ఖాన్‌కి ఇది మొదటి సినిమా. ఈ సినిమాలో ‘పాతాల్ లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ కూడా కీలక పాత్రలో నటించారు. కాగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు మహారాజ్ సినిమాలో ఉన్నాయని కొందరు కేసు పెట్టారు.

సౌరభ్ షా రచించిన ‘మహారాజ్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ పుస్తకం 2013 నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఈ పుస్తకంతో ఎలాంటి గొడవలు లేవు. లా అండ్ ఆర్డర్ దెబ్బతినదు. ఆ తర్వాత నిర్మాత తరపు న్యాయవాది వాదిస్తూ.. ‘మహారాజ్’ సినిమా వల్ల ఎలాంటి గొడవలు జరగవన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు సినిమా విడుదల చేసుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ‘మహారాజ్’ సినిమా చూడాల్సిందిగా నిర్మాత జడ్జిని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌కు అంగీకరించిన న్యాయమూర్తి.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఇందులో లేవని సినిమా చూసిన తర్వాత చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. అయితే ఓటీటీలో ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ మహారాజ్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

తెలుగులోనూ అందుబాటులోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్