Sonakshi Sinha: ప్లేట్ మార్చిన శత్రుఘ్న సిన్హా.. కూతురి పెళ్లి గురించి ఏమన్నాడంటే..
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సౌత్ లోనూ ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో సోనాక్షి హీరోయిన్ గా చేసింది. కాగా సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సినిమా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈ అమ్మడి పెళ్లి హంగామాతో బాలీవుడ్ లో సందడి మొదలైంది. ఎక్కడ చూసిన ఈ అమ్మడి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురిగా సోనాక్షి సినిమాల్లోకి అడుగు పెట్టింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించినా దబాంగ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సౌత్ లోనూ ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో సోనాక్షి హీరోయిన్ గా చేసింది. కాగా సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
అయితే సోనాక్షి , ఇక్బాల్ పెళ్లి పై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. అంతే కాదు ఈ పెళ్లి సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హాకు ఇష్టం లేదు అనికూడా బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇటీవలే ఆయన మాట్లాడుతూ.. ‘నా కూతురి పెళ్లి గురించి నాకు తెలియదు’ అన్నాడు. కానీ సోనాక్షి మాత్రం పెళ్లి పనుల్లో బిజీగా మారిపోయింది. దాంతో అంతా షాక్ అయ్యారు. తండ్రికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుందని పెద్దెత్తున చర్చ జరిగింది. తాజాగా మరోసారి ఆయన సోనాక్షి పెళ్లి పై కామెంట్స్ చేశాడు.
గతంలో ఆయన మాట్లాడుతూ.. నా కూతురు గురించి, ఆమె నిర్ణయాల గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేదు. పెళ్లి గురించి ఆమె నాకు ఎప్పుడూ చెప్పలేదు. నాకు మీడియా రిపోర్టుల ద్వారా మాత్రమే తెలుసు. ఆమె మమ్మల్ని ఆహ్వానిస్తే, నేను, నా భార్య వెళ్లి ఆశీర్వదిస్తాం. నిజానికి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు.. ఆమె ఇప్పుడే కెరీర్ లో సెటిల్ అయ్యిందని అన్నారు. లగే ఆమె ఆనందాన్ని కోరుకుంటున్నామని శతృఘ్న సిన్హా మీడియాకు తెలియజేశారు. అలాగే ఇప్పుడు మాట్లాడుతూ.. ‘జూన్ 23 సాయంత్రం వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటున్నాం. పెళ్లి గురించి మా కుటుంబం ఏమీ చెప్పలేదు. కొన్ని మీడియా కొన్ని ఊహలు రాసింది. ఇది వ్యక్తిగత కుటుంబ విషయం. పెళ్లి అనేది అందరి ఇళ్లలోనూ జరుగుతుంది. పెళ్లికి ముందు కొన్ని విషయాలు చర్చించుకోవడం సహజం. మాకు అంతా ఓకే. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఉంటుంది. ఇక్కడ దాపరికం లేదు. ఇది అన్ని వివాహాలలో జరుగుతుంది. ఆమె శత్రుఘ్న సిన్హా కుమార్తె అయినంత మాత్రాన సోనాక్షికి జీవితంలో తను కోరుకున్నది దక్కదని కాదు. జూన్ 23న మాకు మంచి రోజు కానుంది’ అని అన్నారు. జూన్ 23న సోనాక్షి ఎంగేజ్మెంట్ జరగనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




