Vijay Sethupathi: నన్ను ట్రోల్ చేస్తారని అనుకున్నా..కానీ .. విజయ్ సేతుపతి ఆసక్తికర కామెంట్స్
. ఇప్పటికే తమిళ్, తెలుగు భాషల్లో నటించి మెప్పించిన విజయ్ సేతుపతి ఇప్పుడు హిందీలోకి కూడా అడుగు పెడుతున్నారు. ఆయన నటించిన మేరీ క్రిస్మస్ సినిమా 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో హిందీలో ఓ వెబ్ సిరీస్ లోనూ నటించారు విజయ్ సేతుపతి. కెరీర్ బిగినింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. పిజ్జా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్ సేతుపతి..
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తనదైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు విజయ్ సేతుపతి. ఇప్పటికే తమిళ్, తెలుగు భాషల్లో నటించి మెప్పించిన విజయ్ సేతుపతి ఇప్పుడు హిందీలోకి కూడా అడుగు పెడుతున్నారు. ఆయన నటించిన మేరీ క్రిస్మస్ సినిమా 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో హిందీలో ఓ వెబ్ సిరీస్ లోనూ నటించారు విజయ్ సేతుపతి. కెరీర్ బిగినింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. పిజ్జా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్ సేతుపతి..
ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్నారు విజయ్ సేతుపతి. మేరీ క్రిస్మస్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిందీలోనూ ప్రేక్షకులు విజయ్ సేతుపతిని బాగానే ఆదరిస్తున్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. హిందీలో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తాను అనుకున్నా.. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ ఆదరణ నాకు గొప్ప ఆశీస్సుల్లాంటివి.. ఇంతగా ఆదరిస్తారని అనుకోలేదు అని అన్నారు.
నాకు హిందీ మీద పెద్దగా పట్టు లేకపోవడంతో ఒకట్రెండు సినిమాలు మాత్రమే చేస్తా అని అనుకున్న నా మొదటి రెండుసినిమాలు రిలీజ్ కాకముందే .. ‘ఫర్జీ’, ‘జవాన్’ సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. దాంతో షాక్ అయ్యాను. కానీ ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఆదరిస్తుంటే గర్వంగా ఉంది. మొదట్లో నా హిందీ చూసి అక్కడి ప్రేక్షకులు నన్ను ట్రోల్ చేస్తారు అని అనుకున్నా.. ‘ఫర్జీ’ అసిస్టెంట్ డైరెక్టర్ గోస్వామి కూడా అదే చెప్పను కానీ ఆయన ఇక్కడ ప్రేక్షకులు నిన్ను ఇష్టపడతారు అని చెప్పారు. ఆయన చెప్పినట్టే ప్రేక్షకులు ఆ సిరీస్‌లో నా యాక్టింగ్ ను ఎంజాయ్ చేశారు. ఒక్కసారి ప్రేక్షకులు మనకు కనెక్ట్ అయితే మనల్ని ఇష్టపడుతూనే ఉంటారు అని అర్ధమైంది. బాలీవుడ్‌లో నాకొచ్చిన క్రెడిట్ మొత్తాన్ని దర్శకులు, రచయితలకు ఇస్తాను అని అన్నారు విజయ్ సేతుపతి.
#MerryChristmas in cinemas on Jan 12 🎄#SriramRaghavan @TipsFilmsInd #MatchboxPictures @RameshTaurani #SanjayRoutray #JayaTaurani #KewalGarg @VijaySethuOffl #KatrinaKaif @realradikaa #KavinBabu #Shanmugaraja #AshwiniKalsekar #RajeshWilliams #RadhikaApte @SGayathrie #PariSharma… pic.twitter.com/MdZreWySPp
— VijaySethupathi (@VijaySethuOffl) January 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.