Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.?
పిజ్జా సినిమా తర్వాత విజయ్ సేతుపతి క్రేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మరోవైపు విలన్ గాను నటిస్తూ మెప్పిస్తున్నాడు.

విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి.. పిజ్జా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఆ సినిమా కంటే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించారు సేతుపతి. పిజ్జా సినిమా తర్వాత విజయ్ సేతుపతి క్రేజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మరోవైపు విలన్ గాను నటిస్తూ మెప్పిస్తున్నాడు. దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో విలన్ గా సేతుపతి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తెలుగులో కూడా సేతుపతి నటించారు. ఉప్పెన సినిమాతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించి మెప్పించారు. ఇక ఉప్పెన సినిమా తర్వాత ఆయన మరో తెలుగు సినిమా చేయలేదు. ఇక బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు విజయ్.
రీసెంట్ గా అక్కడ ఓ వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన ఇన్ స్టా గ్రామ్ లో 7.3 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం కొద్దిమందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు.
విజయ్ సేతుపతి కేవలం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. వీరిలో ఒకే ఒక్క అమ్మాయి ఉంది. ఒక్క హీరోయిన్ ను మాత్రమే విజయ్ సేతుపతి ఫాలో అవుతున్నారు. ఆ అమ్మాయి ఎవరో కాదు తెలుగమ్మాయి అంజలి. విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న లిస్ట్ లో ఉన్న ఏకైక హీరోయిన్ అంజలి.
View this post on Instagram



