నన్ను చూసి నువ్వు గర్వపడతావ్ విజయ్.. రష్మిక ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా జోడీ మరో సారి ట్రెండ్ అవుతోంది. నెట్టింట వీరి పెళ్లి వార్తలు మళ్లీ గుప్పమంటున్నాయి. ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.

నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఓ వైపు పాన్ ఇండియా సినిమాలతో రాణిస్తుంది ఈ అమ్మడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగులో వరుస విజయాలతో తక్కువ సమయంలోనే స్టార్ అయ్యింది. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్ ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్ఫణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు.
ఇదిలా ఉంటే రష్మిక సినిమా రిలీజ్ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఆమెకు విషెస్ తెలిపాడు. “నాకు తెలుసు వాళ్లు ఏదో శక్తివంతమైనది తీశారని. ఎదో ముఖ్యమైనది.. జీర్ణించుకోవడానికి కష్టంగా ఉండే విషయం అని కూడా తెలుస్తుంది. అందరు నటీనటుల ప్రదర్శనలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని, రష్మిక, దీక్షిత్, అను ఇమ్మాన్యుయేల్ లతో రాహుల్ ఎంతో అద్భుతమైన కథను సృష్టించాడని నాకు తెలుసు. అది చాలా ప్రభావితం చేయబోతోందని కూడా తెలుసు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో అదంతా మనం చూస్తాం. మూవీ టీమ్ కు నా శుభాకాంక్షలు” అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఇక విజయ్ పోస్ట్ కు రష్మిక రియాక్ట్ అయ్యింది.
” అవును ఇది శక్తివంతమైనది. ఇది ముఖ్యమైన విషయం కూడా. దీనిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది.. విజయ్ చాలా బాగా చెప్పావ్ ధన్యవాదాలు. ఈ సినిమా చాలా కాలంపాటు నెమ్మదిగా అందరి గుండెల్లో మండుతూ ఉంటుంది. విజయ్ .. నువ్వు ప్రారంభం నుండి పరోక్షంగా ఈ చిత్రంలో భాగమయ్యావు. ఈ సినిమా తరువాత నువ్వు నన్ను చూసిగర్వపడతావని నేను ఆశిస్తున్నాను” అంటూ రష్మిక రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరి పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా విజయ్ రష్మికకు ఇటీవలే ఎంగేజ్మెంట్ అయ్యిందని తెలుస్తుంది. వీరి ఎంగేజ్మెంట్ ను చాలా సీక్రెట్ గా ఉంచారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలుస్తుంది.
It IS something powerful. It IS something important. It IS going to be hard to digest – So well put! ❤️ Thankyou ❤️
It’s a SLOW BURN that LASTS LONG. ❤️@TheDeverakonda you’ve indirectly been a part of this film since the beginning and I really hope that you’ll be proud of me… https://t.co/DJCZb2zWZz
— Rashmika Mandanna (@iamRashmika) November 7, 2025
మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




