AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : 175 ఎకరాల భూమిని ప్రజలకు విరాళంగా.. కారణం చెప్పిన టాలీవుడ్ హీరో..

తెలుగులో ఒకప్పుడు తోపు హీరో. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే అనుకోని వివాదాల్లో చిక్కుకుని జైలుకు వెళ్లారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేవలం హీరోగానే కాకుండా సహయ నటుడిగా కనిపిస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Actor : 175 ఎకరాల భూమిని ప్రజలకు విరాళంగా.. కారణం చెప్పిన టాలీవుడ్ హీరో..
Suman
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2026 | 1:13 PM

Share

నటుడు సుమన్ గురించి తెలుసు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తున్నారు. సినిమాలు, టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో సుమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన మాతృభాష తులు అని, మంగళూరులో పుట్టి చెన్నైలో పెరిగి తెలుగు నేర్చుకున్నానని తెలిపారు. వివాదాస్పదంగా ఉన్న తమ కుటుంబ భూమిని దానం చేయాలన్న ఆశయం ఉందని తెలిపారు. తన కుమార్తె చిత్ర పరిశ్రమలో తెరపై కాకుండా గ్రాఫిక్స్, యానిమేషన్ వంటి సాంకేతిక రంగాలపై ఆసక్తి చూపుతోందని ఆయన వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

ఆయన నాలుగు నుంచి ఐదు భాషల్లో పనిచేస్తున్నానని తెలిపారు. మరాఠీలో ఒక సినిమా చేశానని, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలోనూ నటిస్తున్నానని చెప్పారు. తన మాతృభాష తెలుగే కాదని, అది తులు అని సుమన్ స్పష్టం చేశారు. మంగళూరులో పుట్టి, చెన్నైలో పెరిగి, ఆ తర్వాత తెలుగు నేర్చుకున్నానని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

తన కుటుంబానికి సంబంధించిన వివాదాస్పద భూమి (172) కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని సుమన్ తెలిపారు. ఈ కేసు పరిష్కారమైతే, ఆ భూమిని ప్రజల కోసం దానం చేయాలన్నది తమ కుటుంబ ఆశయమని చెప్పారు. ఇది తన వ్యక్తిగత ఆశయం కూడా అన్నారు. తన కుమార్తె గురించి మాట్లాడుతూ ఆమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసే అవకాశం ఉందా అని అడిగినప్పుడు, ఇప్పటివరకు తాము ఆమెను ప్రోత్సహించడంగానీ, నిరుత్సాహపరచడంగానీ చేయలేదని సుమన్ బదులిచ్చారు. అయితే, ఆమెకు తెరపై కాకుండా గ్రాఫిక్స్, యానిమేషన్ వంటి సాంకేతిక రంగాలపై ఎక్కువ ఆసక్తి ఉందని ఆయన వెల్లడించారు.

Suman Movies

Suman Movies

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?