Vijay Deverakonda-Rashmika : ఆ విషయాలు లీక్ చేయకండి.. విజయ్, రష్మిక పెళ్లి శుభలేఖ వైరల్ పై టీమ్ అసహనం..

టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక ఈనెల 26న జరగనుందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో వీరికి సంబంధించిన పెళ్లి పత్రిక నెట్టింట లీక్ అయ్యింది. తాజాగా ఈవిషయంపై టీమ్ స్పందించింది.

Vijay Deverakonda-Rashmika : ఆ విషయాలు లీక్ చేయకండి.. విజయ్, రష్మిక పెళ్లి శుభలేఖ వైరల్ పై టీమ్ అసహనం..
Vijay Deverakonda, Rashmika

Updated on: Feb 19, 2026 | 1:05 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరు.. ఈనెల 26న వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్స్ వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు వీరి పెళ్లి పత్రిక నెట్టింట లీక్ కావడంతో రష్మిక, విజయ్ పెళ్లి వార్తలపై స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు వీరి వివాహ పత్రిక నెట్టింట వైరల్ కావడం.. అందులో వివాహం, రిసెప్షన్ కు సంబంధించిన అన్ని వివరాలు నెట్టింట చక్కర్లు కొట్టడంపై టీమ్ అసహనం వ్యక్తం చేసింది. వివాహ వేడుకకు సంబంధించిన విషయాలు నెట్టింట అలా షేర్ చేయడం కాదంటూ రియాక్ట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

“సోషల్ మీడియాలో విజయ్, రష్మిక పెళ్లికి సంబంధించి అన్ని వివరాలను షేర్ చేస్తున్నారు. పెళ్లి, రిసెప్షన్.. వివరాలన్నింటినీ వెల్లడిస్తున్నారు. దీనివల్ల వివాహ వేడుకకు హాజరయ్యే అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీరి పెళ్లి వేడుకలకు టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన వారితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. అందుకే వివాహ వేడకలకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించడం సరికాదు. పెళ్లికి హాజరయ్యే అతిథులు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్ నెబర్ సైతం కార్డుపై ప్రింట్ చేస్తే.. దానిని షేర్ చేస్తున్నారు. ఈ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం . అలాంటి వేడుకకు సంబంధించిన పోస్టులు పెట్టే ముందు వాటి ద్వారా ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది గమనించాలి ” అంటూ విజయ్ టీమ్ పేర్కొంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ప్రస్తుతం విజయ్, రష్మిక పెళ్లికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే విజయ్ ఇంట్లో పెళ్లి పనులు షూరు అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us