Vijay Devarakonda: అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. వెడ్డింగ్ ప్లాన్స్‌ ఏంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్లలో విజయ్‌ దేవరకొండ కూడా ఒకరు. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ రౌడీబాయ్‌ని పెళ్లికొడుకుగా చూడాలని అతని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల ఓ అమ్మాయి చేతిని పట్టుకున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే లైగర్‌ బాయ్‌ పెళ్లి ముచ్చట ఏమైనా చెబుతాడనుకున్నారు చాలామంది.

Vijay Devarakonda: అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. వెడ్డింగ్ ప్లాన్స్‌ ఏంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ
Vijay Deverakonda
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2023 | 6:10 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్లలో విజయ్‌ దేవరకొండ కూడా ఒకరు. టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ రౌడీబాయ్‌ని పెళ్లికొడుకుగా చూడాలని అతని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇటీవల ఓ అమ్మాయి చేతిని పట్టుకున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే లైగర్‌ బాయ్‌ పెళ్లి ముచ్చట ఏమైనా చెబుతాడనుకున్నారు చాలామంది. అయితే అదేమీ లేదని తేలిపోయింది. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా శుక్రవారం (సెప్టెంబర్‌ 1) న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. శివనిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీలో సమంత హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విజయ్‌ తన పర్సనల్‌ లైఫ్‌ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తన పెళ్లి, అలాగే కాబోయే భార్యలో ఉండే లక్షణాల గురించి పలు విషయాలు చెప్పకొచ్చాడు. ‘నన్ను కేరింగ్‌గా చూసుకునే అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటాను. ఒక్కోసారి నేను వర్క్‌లో పడి తినడం వంటి బేసిక్‌ థింగ్స్‌ కూడా మర్చిపోతాను. నన్ను వర్క్‌ నుంచి బయటకు తీసుకొచ్చి పర్సనల్‌ లైఫ్‌ గురించి గుర్తు చేసే భార్య రావాలి’ అని తన లైఫ్‌ పార్ట్‌నర్‌ గురించి చెప్పుకొచ్చాడు విజయ్‌.

అప్పుడే నా పెళ్లి..

ఇక పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే.. ‘ ఇప్పుడు నా గురించి మా అమ్మ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది అంటూ పెళ్లికి డేట్‌, టైమ్‌ ఏదీ ఫిక్స్‌ చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే తప్పకుండా చేసుకుంటా. అయితే ఎలాంటి హంగామా, హడావుడి లేకుండా నా పెళ్లి జరగాలన్నది నా కోరిక. అలాగనీ ఎవరికీ తెలియకుండా ఆ విషయాన్ని దాచలేను’ అని పేర్కొన్నాడు విజయ్‌. ఇక ఖుషి సినిమా విషయానికొస్తే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ మూవీలో విజయ్‌, సమంతలతో పాటు వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్, జయరాం, సచిన్‌ కేడ్కర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూర్చారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

విజయ్ దేవరకొండ- సమంతల ఫోన్ కాల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో