AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. ఇప్పుడు హాయిగా నిద్రపోయా.. ఇది తెలుగు ప్రజలు ఇచ్చిన ప్రేమ

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మళ్ళీ రావా, జెర్సీ మూవీ లాంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండటంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. ఇప్పుడు హాయిగా నిద్రపోయా.. ఇది తెలుగు ప్రజలు ఇచ్చిన ప్రేమ
Kingdom
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2025 | 4:06 PM

Share

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్ ఓ చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మళ్ళీరావా, జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే కింగ్ డమ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా విజయ్ లుక్ అందరిని ఆకట్టుకుంది. గుండుతో విజయ్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ఈ సినిమా జులై 31న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా విడుదలకానుంది. తాజాగా కింగ్ డమ్ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నా.. ఈ బుకింగ్స్ ఇవన్నీ ప్రజలు ఇచ్చిన ప్రేమే.. ఇప్పుడు అందరూ హిట్ కొడుతున్నాం అని చెప్తుంటే సంతోషంగా ఉంది. ఈ రోజు మా టీమ్ అందరం.. హ్యాపీగా, సంతృప్తిగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాగా అంతకు ముందు విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేసింది. ఈ సినిమాలో విజయ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. రాక్ స్టార్ అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ లోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

ఇక కింగ్ డమ్ మూవీ యూస్ ప్రీమియర్స్ ఈ రోజు మొదలు కానున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా కింగ్‌డమ్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!