AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: అతనితోనే కెరీర్ స్టార్ చేశా..ఈ స్థాయికి వస్తాం అని ఊహించలేదు.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్

'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో సినిమా సారంగపాణి జాతకం. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల చేయనున్నారు.

Vijay Deverakonda: అతనితోనే కెరీర్ స్టార్ చేశా..ఈ స్థాయికి వస్తాం అని ఊహించలేదు.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్
Vijay Deverakonda
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2024 | 3:49 PM

Share

సెన్సిబుల్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న సినిమా విడుదల చేయనున్నారు. తాజాగా సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… ”నా బ్రదర్ దర్శి (ప్రియదర్శి)తో నా కెరీర్ స్టార్ట్ చేశా. ఇంట్రెస్టింగ్ కథల్లో లీడ్ రోల్స్ చేస్తూ మనకు మంచి సినిమాలు అందిస్తున్నాడు. అతను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’ టీజర్ ఇప్పుడే చూశాను. అందులో… దర్శి పాత్రకు జాతకాల మీద నమ్మకం ఉంటుంది. జాతకాలు ఎంత నిజం అనేది నాకు తెలియదు. ‘పెళ్లి చూపులు’ చేసినప్పుడు మేం ఈ స్థాయికి వస్తాం అని ఊహించలేదు. డెస్టినీ మమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చింది. దర్శి జర్నీ చూడటం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ‘సారంగపాణి జాతకం’ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి గారు దర్శకత్వం వహించారు. ఆయన ‘అష్టా చమ్మా’ సినిమా చూసి నేను ఎంత నవ్వుకున్నానో చెప్పలేను. అప్పట్లో అది చాలా డిఫరెంట్ కంటెంట్. ఆ మూవీని చాలా ఎంజాయ్ చేశా. అలాగే, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ గారు ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నారు. ఎన్నో మంచి సినిమాలు చేశారు. ‘సారంగపాణి జాతకం’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మోహనకృష్ణ ఇంద్రగంటి గారికి, శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి ఆల్ ది బెస్ట్” అని అని విజయ్ అన్నాడు.

ఇది కూడా చదవండి : నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు. 

ఇక ‘సారంగపాణి జాతకం’ టీజర్ విషయానికి వస్తే… హీరో జాతకాలను బాగా నమ్ముతాడు. ‘మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది’ అని చెబుతాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం అవుతుంది? అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేసే యువకుడు. మరి, ఆ జాతకాలపై అమితమైన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని సారంగపాణి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? నరేష్ ను ఎందుకు కత్తితో పొడిచాడు? అది నిజమా? కలా? అతని జీవితంలో కీచకుడు ఎవరు? కీచకుడిగా తనికెళ్ళ భరణి ఎటువంటి క్యారెక్టర్ చేశారు? సుందరమ్మ మరణిస్తే హీరో ఎందుకు హ్యాపీగా ఫీలయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు డిసెంబర్ 20న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి. శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, హర్ష చెముడు వినోదం అందర్నీ నవ్విస్తుందని టీజర్ ను బట్టి తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తస్సాదీయ్యా..! స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.? బడా డైరెక్టర్ భార్య ఆమె..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..