Varisu: దళపతా మజాకా.. దుమ్మురేపుతోన్న వారిసు ట్రైలర్.. 20 నిమిషాల్లోనే
తెలుగులో ఈ సినిమాను వారసుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారిసు.. తెలుగులో ఈ సినిమాను వారసుడు పేరుతో రిలీజ్ చేయనున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. యూట్యూబ్ లో ఈ రెండు సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తమిళ్ సినిమా అయినప్పటికీ మన దగ్గర కూడా ఈ సినిమా భారీ అంచనాలే ఉన్నాయి.
తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది . కేవలం 20 నిమిషాల్లోనే 2.2 మిలియన్ వ్యూస్ ను సాధించింది ఈ ట్రైలర్. ఈ సినిమాకోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బీస్ట్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో విజయ్ ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీకి చెందిన చిన్న కొడుకు గా చూపించారు. అతను ఇంటికి దూరంగా తనకు నచ్చిన ప్రపంచంలో బ్రతుకుతుంటాడు. తన ఫ్యామిలీకి బిజినెస్ లో శత్రువులు పెరిగారని తెలిసి విజయ్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. అదే సమయంలో మనస్పర్థల కారణంగా విడిపోయిన తన కుటుంబాన్ని విజయ్ కలుపుతాడు. ఇదే ట్రైలర్ లో చూపించారు. దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.